Breaking News

ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి

దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ (FZ1073) విమానంలో గాల్లో ఉండగానే అనూహ్య భయానక సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియా మీదుగా 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ సడన్‌గా ప్రధాన పైలట్ (భారతీయ జాతీయుడు స్మిత్ మచ్చార్) పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం అపహరణకు గురైనట్లు సూచించే ‘7500’ ఎమర్జెన్సీ కోడ్ నమోదైంది. కాక్‌పిట్ వద్ద కలకలాన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే స్పందించి దాడికి పాల్పడిన కో-పైలట్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

ఆ సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు కాక్‌పిట్ బాధ్యతలను చేపట్టి, విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పైలట్లను ఆసుపత్రికి తరలించగా, నిందితుడిని సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేకపోవడంతో అక్కడి నుంచి విమానాన్ని పంపడానికి సౌదీ నిరాకరించగా, ఫ్లై దుబాయ్ సంస్థ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇదొక ఉగ్రవాద కుట్ర అని పేర్కొంటూ ప్రయాణికులు చూపిన ధైర్యాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *