Breaking News

ఆస్తులన్నీ కొడుకులకు రాసిచ్చి.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్తా (కె) గ్రామంలో కన్నపిల్లల నిర్లక్ష్యం తాళలేక వృద్ధ దంపతులు దారుణంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముంగే నర్సారెడ్డి (88), అంజమ్మ (85) దంపతులకు ముగ్గురు కుమారులు సిద్ధారెడ్డి, కిష్టారెడ్డి, సంగారెడ్డిలు ఉన్నారు. నర్సారెడ్డికి ఉన్న 22 ఎకరాల వ్యవసాయ భూమి మరియు ఇల్లును ముగ్గురు కొడుకులకు పంచేశారు.

అయితే ఆస్తి పంచిన తర్వాత కొడుకులు తల్లిదండ్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వారు ఒక బంధువు ఇంటి వద్ద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తమ జీవనోపాధి కోసం కొడుకులకు ఇచ్చిన భూమి నుంచి కనీసం రెండెకరాలు తిరిగి తమ పేరిట మార్చాలని నర్సారెడ్డి మండలం నుండి జిల్లా స్థాయి అధికారుల వరకు వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు బుధవారం ఉదయం తమ పొలంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మనవడు ముంగే మారుతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *