ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితికి తెరదించుతూ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 104, 1065లను కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మొత్తం రిజర్వేషన్ల శాతం 50 దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల కోటాను 50 శాతానికి లోబడి సమీక్షించి, ఆరు వారాల్లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఇక వార్డుల పునర్విభజనను వ్యతిరేకిస్తూ, ‘సర్’ (SIR) ప్రక్రియ పూర్తయ్యాకే లేదా బీసీ జనాభా గణన తర్వాడే ఎన్నికలు జరపాలంటూ దాఖలైన విచారణ పిటిషన్లను, అలాగే గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకాన్ని సవాల్ చేసిన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలను నిలిపివేసేందుకు నిరాకరించిన కోర్టు, కేవలం రిజర్వేషన్ల పరిమితిని సవరించి ఎన్నికల వైపు అడుగులు వేయాలని స్పష్టం చేయడంతో రాష్ట్రంలో స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.

