హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద తొండపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఉన్న కొత్వాల్‌గూడ నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్ మార్గాన్ని మళ్లించి ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన సదరు మహిళ శంషాబాద్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రదేశంలో డ్రైవర్ దాడికి యత్నించగా, బాధితురాలు ధైర్యంతో వాహనం నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేసి సహాయం కోరింది. దీంతో డ్రైవర్ ఆమె వద్ద ఉన్న రూ. 60,000 నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కొని అక్కడి నుండి పరారయ్యాడు. ఘటన అనంతరం బాధితురాలు ఆర్‌జిఐఏ (RGIA) పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
మహిళపై లైంగిక దాడికి యత్నించి క్యాబ్ డ్రైవర్

