Technology
‘మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు’: ఆంత్రోపిక్ నుంచి తప్పుకున్న AI పరిశోధకుడు!
శాన్ ఫ్రాన్సిస్కో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి రేసులో దిగ్గజ కంపెనీలు మానవాళి భద్రతను పక్కనబెట్టి తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ప్రముఖ ఏఐ పరిశోధకుడు జేకబ్ కాక్సన్ (27) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓపెన్ ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic) కంపెనీల్లో మోడల్స్ శిక్షణ విభాగంలో మూడేళ్లుగా పనిచేసిన ఆయన, ఇటీవల ఆంత్రోపిక్ నుండి రాజీనామా చేసి ఏఐ పరిశ్రమ నుంచే తప్పుకున్నారు. సంచలన ఆరోపణలు & ముఖ్యాంశాలు: ఏఐ వ్యవస్థల స్వయం-శిక్షణ (Recursive Self-Improvement)…
ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన
మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఓటర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన శిబిరం నిర్వహించారు. వివిధ కారణాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు శిబిరానికి హాజరై, తమ తల్లిదండ్రులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు.నోటీసుల్లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఓటర్లు అందజేసిన ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ ప్రక్రియలో అర్హత, పత్రాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేస్తున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ధ్రువీకరణ పత్రాల…
ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డు అందుకున్న అడ్వకేట్ యరగాని సోనీ
జూనియర్ న్యాయవాదిగా ప్రతిభకు గుర్తింపు హుజూర్‌నగర్,సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును అందుకున్నారు. కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదుల…
బీఆర్ఎస్‌లో భారీ చేరికలు
కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్ పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుంచి సుమారు 100 మంది కార్యకర్తల చేరిక 100 మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కొత్తగూడెం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాత…
సివిల్స్ కొట్టే ఛాన్స్.. ఉచిత శిక్షణకు గ్రీన్‌సిగ్నల్!
రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ రూ.3 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక.. ఈ నెల 23లోగా దరఖాస్తు భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ…
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలం, సెప్టెంబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి). సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించేందుకు రాజేంద్రనగర్‌లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల్లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు….
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలి
గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయాలి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు గృహ నిర్మాణ పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పట్టణ జర్నలిస్టులు తహసీల్దార్ బండా కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, కమిషనర్ కే. సతీష్‌లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలిసిన వి. పార్వతి హాథీరామ్ నాయక్
భద్రాచలం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలంలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి. పార్వతి హాథీరామ్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ను శాలువా, బొకేతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజన రైతులకు రావాల్సిన పోడు…
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి) సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన రైతులు, మహిళలు, యువకులు, సామాన్య ప్రజల…
సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవం ఘనంగా
మద్రాస్ తండలో జెండా ఆవిష్కరణ.. బంజారా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలి టేకులపల్లి, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ గ్రామంలో సేవాలాల్ సేన 12వ వార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు.సేవాలాల్ సేన సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన…

