Breaking News

అమెరికాలో విషాదం: పుట్టినరోజే నిర్మల్ యువకుడి మృతి!

నిర్మల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిర్మల్ జిల్లా యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి, సరిగ్గా తన పుట్టినరోజే ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడిని నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) గా గుర్తించారు. ఘటన వివరాలు: ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు పుట్టినరోజే మరణించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యానంద రెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత…

Read More

బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్: 30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

ఆదిలాబాద్ / మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ (ఆహారం వికటించడం) కలకలం రేపింది. రాత్రి భోజనం తిన్న తర్వాత దాదాపు 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న కాసేపటికే విద్యార్థినులు వికారంగా అనిపించడం, వాంతులు మరియు విరేచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు….

Read More

దశాబ్దాలుగా గ్రంథాలయ పోస్టుల భర్తీ శూన్యం: ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థుల డిమాండ్!

మంచిర్యాల / హైదరాబాద్: తెలంగాణలో గ్రంథాలయ (లైబ్రేరియన్) ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులు దాదాపు మూడు దశాబ్దాలుగా (30 ఏళ్లుగా) నిరీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం.. ప్రభుత్వ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ పోస్టులను చివరిసారిగా 1981 లో భర్తీ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ పోస్టుల భర్తీ ఊసే లేదు. అభ్యర్థుల ప్రధాన సమస్యలు & ఆవేదన: సమస్యల…

Read More

ఆదిలాబాద్‌లో వైభవంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు: క్వీన్ ఆఫ్ విలేజ్ ముఖ్రా (కె)లో ఫ్లెక్సీకి క్షీరాభిషేకం!

ఆదిలాబాద్ / ఇచ్చోడ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కె) గ్రామంలో గ్రామస్తులు గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద కేటీఆర్ భారీ ఫ్లెక్సీకి మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ అందించిన సేవలను, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. గ్రామస్తులు తెలిపిన విశేషాలు:

Read More

విద్యార్థులపై దాడి అమానుషం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్‌లో మహాధర్నా ముధోల్, జూలై 24: E6 tv NEWS తిరుపతి గౌడ్. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద శుక్రవారం మహాధర్నా నిర్వహించారు. ఏఐసీసీ మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…

Read More

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: పోతన్న యాదవ్

ముధోల్, జూలై 23: E6 tv NEWS (తిరుపతి గౌడ్) నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, విద్యార్థుల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం…

Read More

అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నీట్ పేపర్ లీక్‌పై కాంగ్రెస్ నిరసన – కేంద్ర మంత్రుల రాజీనామాకు డిమాండ్ నిర్మల్‌లో ధర్నా, దిష్టిబొమ్మ దహనం – కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిర్మల్, జూలై 22 (E6 tv NEWS: Md అమీనుద్దీన్): నీట్ (NEET-UG) పేపర్ లీక్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ…

Read More

నిజామాబాద్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్ర విమర్శలు

నీట్ అంశంపై కాంగ్రెస్ ఆందోళనలను తప్పుబట్టిన అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా పోలీసులతో  తోపులాట ఇందూరు, జూలై 22: E6 tv NEWS శివ ఠాకూర్ నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఆందోళనలను తీవ్రంగా తప్పుబడుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బుధవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను…

Read More