Adilabad
గోదావరి పుష్కరాలు–2027కు పోలీసుల ముందస్తు సన్నాహాలు
డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమగ్ర సమీక్ష నిజామాబాద్, జూలై 25: (E6 tv NEWS : శివ ఠాకూర్) గోదావరి పుష్కరాలు–2027ను భక్తులకు సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్., గోదావరి పరివాహక ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ,…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: మహేష్ కుమార్ గౌడ్
రాహుల్ గాంధీ నేతృత్వంలోని పోరాటానికే ఫలితం ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధానికి సమగ్ర చట్టం తీసుకురావాలి – కేంద్ర ప్రభుత్వానికి టీపీసీసీ అధ్యక్షుడి డిమాండ్ జూలై 25: (E6 tv NEWS ప్రతినిధి). కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ కలిసి సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ…
హైకోర్టు న్యాయమూర్తులకు నిజామాబాద్‌లో ఘన స్వాగతం
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జస్టిస్‌లు జిల్లా అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చ నిజామాబాద్, జూలై 25: E6 tv NEWS. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తంగిరాల మాధవీదేవి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గడి ప్రవీణ్ కుమార్లకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగా స్థానిక రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకోగా, పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం…
తెలంగాణకు వర్ష సూచన: రేపటి నుంచి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి (జూలై 26) వాతావరణం మారనుంది. జూలై 26 నుంచి జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్ష ప్రభావం ఉండే ప్రాంతాలు: ప్రజలకు హెచ్చరిక: వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రాకపోకలకు అంతరాయం కలగడం మరియు రోడ్లపై విజిబిలిటీ తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు…
నిర్మల్‌లో దారుణం: సుపారీ ముఠాతో సవతి కొడుకు హత్య.. పిన్ని అరెస్ట్!
నిర్మల్ : కుటుంబంలో తీవ్ర కలకలం రేపిన సవతి కొడుకు హత్య కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం రట్టు చేసిందనే కక్షతో సవతి కొడుకును సుపారీ ముఠాతో దారుణంగా హత్య చేయించిన సవతి తల్లి అన్వరి బెగం సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? ఘటనా స్థలం వద్ద దాడి & అరెస్ట్: జూలై 15న అస్లమ్ ఆటోలో ప్రయాణికులతో వైఎస్సార్ కాలనీకి వస్తుండగా.. నిందితులు (ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్…
తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
జూలై 25: E6 tv NEWS ప్రతినిధి. ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా జరుపుకునే పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొలి ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం ఉండటంతో భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని అనుగ్రహం పొందుతారని తెలిపారు.ధర్మం,…
అక్రమ సంబంధం, కుటుంబ విభేదాలే హత్యకు కారణం
రూ.6 లక్షల సుపారీతో అస్లాం ఖాన్ హత్య – అంతర్రాష్ట్ర సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదించిన నిర్మల్ పోలీసులు – ఎస్పీ జానకి షర్మిల నిర్మల్, జూలై 25: E6 tv NEWS, Md అమీనుద్దీన్. నిర్మల్ జిల్లాలో ఈ నెల 15వ తేదీన జరిగిన అస్లాం ఖాన్ హత్య కేసును నిర్మల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అక్రమ సంబంధం, కుటుంబ విభేదాల నేపథ్యంలో…
విద్యా సంస్థల్లో డ్రగ్స్‌పై ఉక్కుపాదం
యాజమాన్యాలకూ బాధ్యత.. అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి E6 tv NEWS : రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే ఆయా సంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులను…
నీట్ పేపర్ లీక్‌పై నిర్మల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ మైనారిటీ ర్యాలీ
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ నిర్మల్, జూలై 24 E6 tv news Md అమీనుద్దీన్: నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ మైనారిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనారిటీ నాయకుడు కాంగ్రెస్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్ల మాట్లాడుతూ, నీట్ పేపర్ లీక్ కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థుల…
వాన కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ…
వర్షాభావంతో విలవిల్లాడుతున్న ఖరీఫ్ పంటలు – పెరుగుతున్న రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యలపై ఆశలు నిజామాబాద్, జూలై 24: (E6 tv NEWS, శివ ఠాకూర్-ప్రత్యేక కథనం) తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కీలక దశలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఉత్సాహంగా సాగు పనులు ప్రారంభించిన రైతులు, ప్రస్తుతం వర్షాభావం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండిపోతున్న పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది…

