Breaking News

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీలు

24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి).

ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచీ లాంటి వారని, వారి మార్గదర్శకత్వంలో విద్యార్థులు తమ ప్రతిభను పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని నల్గొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. రమాదేవి అన్నారు.

యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో వివిధ మండలాలకు చెందిన 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ముఖ్య అతిథులు ఎం. రమాదేవి, భద్రాచలం ఎంవీఐ, టీజీఓ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య చేతుల మీదుగా అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అందించే బోధన విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందన్నారు. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులకు సమానమేనని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతోమంది ఉపాధ్యాయులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు.

ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, పాఠశాలలు దేవాలయాలైతే ఉపాధ్యాయులు దేవుళ్లతో సమానమని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిపై మరింత బాధ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగ ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు.

ఈ సందర్భంగా ఎం. రమ, బి. బాలాజీ, వి. రాజశ్రీనివాసరావు, సోయం కృష్ణ, ఎన్. శ్రీనివాస్, టి. వనజ, షాబీర్‌బాషా, వి.వి. కోటేశ్వరరావు, బి. రమేష్ రాథోడ్, బి. బాబూరావు, ఎం. రూపావినయ్, టి. శ్రీరాములు, జి. మోహన్‌లాల్, పి. సుధశ్రీ, ఎం. రాజయ్య, వి. దస్రు, బి. రాము, ఆర్. నాగజ్యోతి, ఎన్. కిరణ్‌కుమార్, బి. సుజాత, ఎస్. రాజశేఖర్, ఎస్.కె. నజియా, ఎం. పుష్పలత, కె. నాగమణిలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు.

కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవ జిల్లా అధ్యక్షుడు బి. వీరునాయక్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ, డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, రత్నాకర్, కమలాకర్, జుబ్బు, మొక్కల బాలు, రాజేష్, రంగ, సుభాని, జయశ్రీ, వరప్రసాద్, బాలకృష్ణ, నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *