Breaking News

ఎల్ నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలే పరిష్కారం

రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి – ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమీక్షలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడం నిజామాబాద్, జూలై 20: E6 tv NEWS.సూపర్ ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం శ్రేయస్కరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామీణ స్థాయిలో రైతులకు…

Read More

అంకాపూర్ వెళ్లకుండా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణకు హౌస్ అరెస్ట్

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా బయలుదేరిన సందర్భంగా పోలీసుల అడ్డుకట్ట – కాంగ్రెస్ ప్రభుత్వంపై ధన్‌పాల్ తీవ్ర విమర్శలు నిజామాబాద్, జూలై 20:E6 tv NEWS శివ ఠాకూర్ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు అంకాపూర్‌కు బయలుదేరిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు ఆయన నివాసం వద్దే అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా…

Read More

‘ఇందూర్ రణభేరి’ సెగతో కాంగ్రెస్‌లో కలవరం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి డైవర్షన్ రాజకీయమే: బీజేపీ

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కాంగ్రెస్ లక్ష్యం: దినేష్ పటేల్ కులాచారి బహిరంగ చర్చకు కాంగ్రెస్ నేతలు రాలేదు.. బీజేపీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండించిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ పూర్తి మద్దతు నిజామాబాద్,జూలై 20: E6 tv NEWS (శివ ఠాకూర్) ఇందూర్ రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విశేష స్పందనతో కాంగ్రెస్ పార్టీ వణికిపోతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘ఎమ్మెల్యే…

Read More

ఈశాన్య తెలంగాణలో నేడు విస్తృత వర్షాలు

నిజామాబాద్‌తో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – హైదరాబాద్‌లో సాయంత్రం జల్లులు నిజామాబాద్, జూలై 19: E6 tv NEWS. రాష్ట్రంలో నేడు (జూలై 19) ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల,…

Read More

తానూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం

రూ.98.12 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తానూర్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)తానూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో నాబార్డ్ (NABARD) నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, మౌలిక సదుపాయాలను ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.56 లక్షల వ్యయంతో నిర్మించిన మొదటి అంతస్తులోని అదనపు తరగతి గదులను, అలాగే రూ.42.12 లక్షలతో ఏర్పాటు చేసిన…

Read More

క్షేత్ర సందర్శనతో విద్యార్థులకు పోస్టల్ సేవలపై అవగాహన

ముధోల్ పోస్టాఫీసును సందర్శించిన శ్రీ సరస్వతీ శిశు మందిర్ 4వ తరగతి విద్యార్థులు ముధోల్, జూలై 18: E6 tv NEWS (తిరుపతి గౌడ్)విద్యార్థులకు పాఠ్యాంశాలను ప్రత్యక్ష అనుభవంతో బోధించాలనే ఉద్దేశ్యంతో ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాల 4వ తరగతి విద్యార్థులు శనివారం స్థానిక పోస్టాఫీసును క్షేత్రస్థాయిలో సందర్శించారు. విజ్ఞానశాస్త్రం బోధనలో భాగంగా నిర్వహించిన ఈ విద్యా పర్యటనలో విద్యార్థులు పోస్టాఫీసు పనితీరు, ప్రజలకు అందిస్తున్న వివిధ పోస్టల్ సేవలను…

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్…

Read More

గౌడ, యాదవ కులాలపై వ్యాఖ్యల వివాదం

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి: గౌడ జన హక్కుల పోరాట సమితి నిర్మల్, జూలై 16: E6 న్యూస్ తిరుపతి గౌడ్ గౌడ, యాదవ సమాజాలపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు చేపూరి…

Read More

లోకేశ్వరం మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భవిత భవనం, కేజీబీవీ మౌలిక సదుపాయాలు, పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం – దివ్యాంగులకు పరికరాల పంపిణీ లోకేశ్వరం, జూలై 16: E6 న్యూస్, తిరుపతి గౌడ్. లోకేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం చుట్టారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన భవిత భవనంను ప్రారంభించి, దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సామగ్రి, ఇతర సహాయక పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలలో నాబార్డ్…

Read More