Breaking News

వినాయక మండపాల వద్ద నియమాలు పాటించండి

ముధోల్ సీఐ రవీందర్

ముధోల్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి).

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసు అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ముధోల్ సీఐ రవీందర్ సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వినాయక మండపం నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను నిర్వహించాలన్నారు. వినాయకుడి ఆగమనం కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహకులు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.వినాయక విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ వైర్ల విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలకు సాధారణ కర్రలతో తాకడం లేదా వాటిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దన్నారు. అవసరమైన సందర్భాల్లో రబ్బరు పూత ఉన్న పరికరాలను మాత్రమే ఉపయోగించాలని, చేతులకు రబ్బరు గ్లౌసెస్ ధరించాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఐ రవీందర్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *