Karimnagar
విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు
మద్నూర్, ఆగస్టు 19: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల కేంద్రంలోని నడిమ హనుమాన్ మందిరం వద్ద విద్యుత్ వైర్లకు అడ్డుగా వస్తున్న చెట్ల కొమ్మల తొలగింపు పనులను బుధవారం గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ పరిశీలించారు.మందిరం ముందు శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కొత్త స్తంభం ఏర్పాటు చేస్తున్న పనులపై విద్యుత్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో…
ప్రపంచ ఫోటోగ్రఫీ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్). ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు…
కరీంనగర్‌లో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్) పరిధిలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మండపాల ఉచిత విద్యుత్ బిల్లుల భారమంతా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషనే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ముఖ్యాంశాలు: మండపాల అనుమతులు మరియు నగర పాలక సంస్థ సేవలకు సంబంధించిన సమాచారం కోసం Karimnagar Municipal Corporation Portal ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
బైక్ దొంగల ముఠా అరెస్ట్.. రెండు బైకులు స్వాధీనం
మద్నూర్, ఆగస్ట్ 18: (E6tv NEWS: ప్రతినిధి). బైక్‌లను దొంగిలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను మద్నూర్ ఎస్‌ఐ ఏ. మోహన్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని దేగ్లూర్‌కు చెందిన జాదవ్ అజయ్, షేక్ అయాన్‌లు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో మహారాష్ట్రలోని చాకూర్ పోలీసులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని మద్నూర్, డోంగ్లీ మండలాల్లో బైక్‌లను దొంగిలించేందుకు…
కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు జుక్కల్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని చారిత్రక కౌలాస్ కోటకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. కౌలాస్ కోటను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిన కోటల జాబితాలో చేర్చడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషి, చొరవతో కౌలాస్ కోటకు మరింత ప్రాధాన్యత లభించిందని స్థానిక నాయకులు పేర్కొన్నారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న…
పాపన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ముధోల్, ఆగస్టు 18:(E6tv NEWS: A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ గౌడ సంఘాల నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం…
పాపన్న గౌడ్ సాక్షిగా దళిత బహుజనుల హక్కుల కోసం ఐక్య ఉద్యమం
నిర్మల్, ఆగస్టు 18: (Etv NEWS,A. తిరుపతి గౌడ్). సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌడజన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించారు.కార్యక్రమానికి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ మాజీ…
పేదలకు భూమి పంపిణీ చేయాలి: కల్వకుంట్ల కవిత
సామాజిక న్యాయం కోసం మరోసారి భూ పంపిణీ అవసరం అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకంతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి: కవిత బంజారాహిల్స్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో పాటు, తాము అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి…
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,…

