Karimnagar
పేద కుటుంబం ఇంటి కూల్చివేతను అడ్డుకున్న మూడు కాలనీల నాయకులు!
గోపీనగర్, బాపునగర్, నెహ్రూనగర్ ప్రజల ఐక్యతకు నిదర్శనం కార్పొరేటర్ రాగం నాగేందర్ జోక్యంతో నిలిచిన కూల్చివేత చర్యలు శేరిలింగంపల్లి, నవంబర్ 11 (E6tv న్యూస్). పేద కుటుంబం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకుంటున్న ఇంటి కూల్చివేతను గోపీనగర్, బాపునగర్, నెహ్రూనగర్ కాలనీల నాయకులు, ప్రజలు ఐక్యంగా అడ్డుకున్నారు. స్థానికంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో మూడు కాలనీల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పేద కుటుంబానికి అండగా నిలిచారు. గోపీనగర్ కాలనీకి చెందిన దేవులపల్లి శివ తన…
ఆ గ్రామంలో పాలన ఎటు?
రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు.. డీ అంటే డీ! ఒకే గ్రామం.. రెండు వర్గాలు.. రెండు నియోజకవర్గాల రాజకీయ అండదండలు! వర్గపోరులో బలవుతున్న సామాన్య ప్రజలు.. అధికారుల పరిస్థితి ఏమిటి? E6 TV న్యూస్ – ప్రత్యేక కథనం ఆ గ్రామంలో పాలన ఎటు సాగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయా? లేక రెండు వర్గాల ఆధిపత్య పోరులో గ్రామ పాలనే గందరగోళంలో పడిందా? ప్రస్తుతం ఆ గ్రామంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒకే…
కోరుట్ల మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణం!
నిర్మాణం ఆపినట్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారా? మున్సిపల్ అధికారుల తీరుపై సంఘ సభ్యుల ఆగ్రహం కోరుట్ల, నవంబర్ 11 (E6tvన్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్ 3760/95, ఇంటి నంబర్ 5-1-12 పరిధిలోని స్థలంలో సంఘ సభ్యులకు తెలియకుండా సుమారు 50 గజాల స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై…
ఆటోపై కూలిన భారీ వృక్షం.. ఐదుగురికి గాయాలు!
డ్రైవర్, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రుద్రూర్ (E6tv న్యూస్). రుద్రూర్–బోధన్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి ఆటోపై పడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన కలకలం రేపింది. బోధన్ వైపు వెళ్తున్న TS 16 UA 0344 నంబర్ గల ఆటోపై ఒక్కసారిగా భారీ వృక్షం కూలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో…
బుగ్గారం రైతుల ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి!
బీటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి పక్కా రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబకు వినతిపత్రం అందజేసిన చుక్క గంగారెడ్డి జగిత్యాల, నవంబర్ 09 (E6tv న్యూస్). బుగ్గారం గ్రామ రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక హక్కుల కార్యకర్త, గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జన…
నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు వ్యాపారుల వెనుకడుగు!
క్వింటాల్‌కు రూ.3,800 నుంచి రూ.2,300కు పడిపోయిన ధర రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తూ కొనుగోలుదారుల కోసం అన్నదాతల ఎదురుచూపులు వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి కోటగిరి, నవంబర్ 10: (E6tv NEWS). ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంట చేతికొచ్చినా కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని…
భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ గీతం
పటాన్చెరులో ఘనంగా అయ్యప్ప భక్తిగీతం ఆడియో విడుదల గురుస్వామి నర్రా బిక్షపతి, రమ సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ అయ్యప్ప భక్తుల మనసులను హత్తుకునేలా ఆర్ఆర్ టీం భక్తిగీతం భక్తి పాటలతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి: గురుస్వామి నర్రా బిక్షపతి పటాన్చెరు, నవంబర్ 9 (E6tv న్యూస్). అయ్యప్ప స్వామి భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తేలా రూపొందించిన ‘హరిహర సుతుడా శరణం అయ్యప్ప’ భక్తిగీతం ఆడియో విడుదల కార్యక్రమం పటాన్చెరులో ఘనంగా జరిగింది. పట్టణంలోని శాంతినగర్ అయ్యప్ప…
ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం.. ప్రభుత్వ భూములకు రక్షణేదీ?
ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోని అధికారులు! కుందాపూర్‌లో చెరువులు, కుంటలు, గుట్టల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు ప్రభుత్వ భూములను కాపాడాలని సర్పంచ్ సాయిలు డిమాండ్ నవంబర్ 2న ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన ఇంటి నంబర్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా న్యాయం జరగలేదంటున్న అశోక్ ప్రజావాణికి ప్రధాన అధికారుల గైర్హాజరుపై విమర్శలు రుద్రూర్, నవంబర్ 10 (E6 టీవీ న్యూస్): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం కేవలం…
కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దినేష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
వడ్డేపల్లి దినేష్ రెడ్డికి జిల్లా హ్యాండ్‌బాల్ పగ్గాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ఎల్లారెడ్డి, నవంబర్ 07 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి దినేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సదాశివనగర్ మండలం భూంపల్లిలోని జీపీ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు
గాండ్ల సంఘం ఆత్మగౌరవ భవనానికి రూ.1.50 లక్షలు కేటాయింపు 38 బీసీ కుల సంఘాలకు మొత్తం రూ.88.50 కోట్ల నిధులు మంజూరు జీవో, ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ శేరిలింగంపల్లి, నవంబర్ 07 (E6tv న్యూస్). తెలంగాణ రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గాండ్ల, తెలికుల, దేవతెలికుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.1.50 లక్షల నిధులు మంజూరు…
