Breaking News

సమతుల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి). పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ…

Read More

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి బోధన

బోధన్, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) బోధన్‌లో ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ వివిధ తరగతుల్లో బోధనా కార్యక్రమాలను నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి. సత్య వర ప్రసాద్‌తో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి…

Read More

శిరీష హత్యాచార ఘటనపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశం కొత్తగూడెం:, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి శిరీష హత్య, అత్యాచారం ఘటనపై కార్యాచరణ రూపొందించేందుకు సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా తెలిపారు.సోమవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెంలోని సీపీఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరిభవన్‌’లో రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు…

Read More

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…

Read More

పలువురి దశదినకర్మల్లో పాల్గొని సంతాపం తెలిపిన కొత్వాల

కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు. పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ డైరెక్టర్‌, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాల్వంచకు చెందిన…

Read More

చెస్‌లో నవభారత్ విద్యార్థుల సత్తా

అండర్‌-10లో భట్టు జైకి ప్రథమ బహుమతి.. అండర్‌-15లో లిఖిత సాయికి ఐదో స్థానం పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చెస్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌-10 విభాగంలో భట్టు జై ప్రథమ బహుమతి సాధించగా, అండర్‌-15 విభాగంలో భట్టు లిఖిత సాయి ఐదో స్థానంలో నిలిచి ప్రతిభ కనబరిచింది.గత నాలుగు నెలలుగా జిల్లాస్థాయి చెస్ పోటీల్లో వరుసగా…

Read More

దశాబ్దాల రైతుల కల సాకారం!

మారెళ్లపాడు లిఫ్ట్‌లో గోదావరి పరవళ్లు.. 16,180 ఎకరాలకు సాగునీటి భరోసా అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెదులుతున్న సాగునీటి కల సాకారమైంది. వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బీడుగా మారిన భూములకు గోదావరి జలాలను అందించాలన్న రైతుల చిరకాల వాంఛ మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంతో నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తవడంతో ఆయకట్టు…

Read More

తుమ్మల చెరువు రైతుల సాగునీటి కల నెరవేరే దిశగా కీలక అడుగు

మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ సక్సెస్.. రైతుల్లో ఆనందోత్సాహాలు అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). తుమ్మల చెరువు రైతుల చిరకాల సాగునీటి కల సాకారం దిశగా కీలక ముందడుగు పడింది. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవతో చేపట్టిన మారెళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో తుమ్మల చెరువు ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గోదావరి జలాలను తుమ్మల చెరువుకు తరలించి తమ పొలాలకు సాగునీరు అందించాలన్నది ఈ ప్రాంత…

Read More

అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభం

ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య పరీక్షలు: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాచలం–చర్ల రోడ్డులో రాధా హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్‌ను భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మల్ల ప్రతాప్ కుమారుడు నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా భద్రాచలం, పరిసర ప్రాంతాల…

Read More

యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలే లక్ష్యం

తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ: డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో యువత సంక్షేమం, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్‌ అన్నారు. పదేళ్ల నిరుద్యోగాన్ని తరిమికొడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. భీంగల్‌ మండల కేంద్రంలో…

Read More