Breaking News

ఎన్నికల హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ను వదలం

కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన పాల్వంచ, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆ పార్టీని వదిలేది లేదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్…

Read More

తిరస్కరించిన ఓట్లను పునరుద్ధరించుకోవాలి

పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో తిరస్కరించబడిన ఓట్లను పునరుద్ధరించుకోవాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, డీసీఎస్‌ఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. పాత పాల్వంచలోని 78, 79, 80, 81 పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఓటర్లతో బీఎల్‌ఓలు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ.. ఓటు హక్కు…

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

అంగన్వాడి టీచర్ అక్రమ అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఏర్గట్ల, సెప్టెంబర్‌ 8:(E6tv NEWS: ప్రతినిధి). అంగన్వాడి టీచర్స్ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్‌పల్లి, ఇందల్వాయి పోలీస్‌…

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఏర్గట్ల, సెప్టెంబర్‌ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్‌పల్లి, ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్లలో…

Read More

కరీంనగర్‌లో షాకింగ్ సీన్: ఏకంగా రూరల్ పోలీస్ స్టేషన్‌కే కన్నం వేసిన దొంగ!

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన చోటుచేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే పోలీసు పెట్రోలింగ్ ఇన్నోవా వాహనాన్ని దొంగిలించి పరారయ్యాడు. ఘటన వివరాలు: పోలీసులు దొంగిలించిన ఇన్నోవా వాహనాన్ని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More

మద్నూర్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మద్నూర్, సెప్టెంబర్ 8:(E6tv న్యూస్: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ ఉష, ఎంఈవో రాములు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమష్టి భావన పెంపొందుతాయని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో మండలంలోని…

Read More

శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి

కేసును నీరుగారిస్తే రాజధాని ముట్టడిస్తాం కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నర్సు ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాజధానిని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శిరీష హత్య ఘటనపై సోమవారం కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్‌లో రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్న గిరిజన యువతిపై…

Read More

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

రాజ్యాంగ పదవులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంది ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పినపాక, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న…

Read More

ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం

ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి…

Read More

నీట్‌లో ప్రతిభ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు

గిరిజన విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సహాయం అభినందించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య వాసిని నీట్ అడ్వాన్స్–2026లో ప్రతిభ కనబరిచి, స్టేట్ ర్యాంక్ 1962 సాధించి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో విద్యార్థినిని అభినందించిన పీవో.. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించి,…

Read More