Khamam
మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరలేదు.. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
గోదావరి జలాలను ఎత్తిపోసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ను నింపాలి: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మేడిగడ్డ, అక్టోబర్ 3 (E6tv న్యూస్). మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85 పిల్లర్లు నిటారుగా ఉన్నాయని, కేవలం రెండు మూడు పిల్లర్లకు మరమ్మతులు అవసరమైతే వాటిని కూడా చేపట్టకుండా ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని…
మూడు డివిజన్ల ప్రజల సౌకర్యార్థం పీహెచ్సీ, మహిళా భవనం నిర్మించాలి
మహిళల వినతికి సానుకూలంగా స్పందించిన 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ నిజామాబాద్, నవంబర్ 3 (E6tv న్యూస్). నిజామాబాద్ నగరంలోని హమాల్వాడి, నాందేవ్‌వాడ, సుభాష్‌నగర్ ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం హమాల్వాడి చౌరస్తాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), మహిళా భవనం నిర్మించాలని కోరుతూ ఆయా ప్రాంతాలకు చెందిన మహిళలు 35వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన మహిళా ప్రతినిధులతో సమావేశమైన ఎర్రం సుధీర్‌కు మహిళలు…
భూ వివాదం వెనుక భారీ కుట్ర ఉందా?
సిర్పూర్ శివారులో ఎకరం భూమిపై వివాదం.. జేసీబీతో నాలుగు గదుల ఇల్లు నేలమట్టం! 2006 జూన్ 26న తాళ్ల పద్మాబాయి నుంచి భూమి కొనుగోలు చేశానంటున్న నారాయణరెడ్డి 20 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నానని బాధితుడి వెల్లడి 2024, 2025లో రెండుసార్లు భూ సర్వే చేయించారని వెల్లడి 30 నుంచి 40 మంది వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ అక్టోబర్ 31న జేసీబీతో ఇంటి కూల్చివేత.. రూ.10 లక్షల నష్టం కొందరు రాజకీయ నాయకులు, విలేకరుల ప్రమేయం…
అక్రమ నీటి వ్యాపారంపై అధికారులకు స్థానికుల ఫిర్యాదు
మూడు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు.. అక్రమ బోర్లు, నీటి గుంతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెల్లాపూర్, అక్టోబర్ 31 (E6tv న్యూస్). తెల్లాపూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతంలో అక్రమ నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్‌తో పాటు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేసి, అక్రమ నీటి వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ శివారు ప్రాంతాల్లో అక్రమంగా…
ఆస్తి వివాదం.. తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
పెట్రోల్ బంకు విషయంలో తలెత్తిన గొడవే హత్యకు కారణమా? ధర్మపురి, అక్టోబర్ 31 (E6tv న్యూస్):l. ఆస్తి వివాదాలు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కన్నతండ్రినే కుమారుడు కర్రతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ధర్మపురి మండలం నెరెళ్ల గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటేశ్ (55)ను ఆయన కుమారుడు మేడిపల్లి లక్ష్మణ్ (36) శనివారం కర్రతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి…
హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణలో లోపాలపై అధికారులపై ఆగ్రహం కరీంనగర్, అక్టోబర్ 31 (E6tv న్యూస్). కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిని అడిషనల్ కలెక్టర్ అశ్విని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపిడి, గైనకాలజీ, అత్యవసర చికిత్స విభాగం, డయాలసిస్ కేంద్రం, మందుల నిల్వ గదులను సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య…
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ.. రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో భాగంగా రన్ నిజామాబాద్, అక్టోబర్ 31 (E6tv NEWS:శివ ఠాకూర్). పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమంలో భాగంగా రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని కోర్టు చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ…
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘనంగా నివాళులు
దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ జగిత్యాల, అక్టోబర్ 31 (E6tv న్యూస్). భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో శనివారం పటేల్ విగ్రహానికి…
విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం
నిర్మల్, అక్టోబర్ 31 (E6tv న్యూస్). నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ హైస్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ సెక్రటరీ పి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అడ్వకేట్లు రాజేశ్వర్ రత్నం, ఎస్. నరేందర్, వి. మధుకర్, ఎస్ఐ సాయి సిద్ధార్థ్ పాల్గొని విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, న్యాయ సేవల ప్రాముఖ్యత తదితర అంశాలను…
ఎల్‌నినో ఎఫెక్ట్.. తాగునీటి కోసం రూ.120 కోట్లు!
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లతో పాటు, ఇతర జిల్లాల తక్షణ అవసరాలకు ఒక్కో దానికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అద్దె బోరుబావులు, ట్యాంకర్ల…
