Khamam
చెన్నమ్మ కోరి దేవస్థానంలో భక్తుల సందడి
మద్నూర్, ఆగస్టు 29:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కుర్చీర్ గ్రామంలోని కోడిచీర శివారులో వెలసిన చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. చిన్న ఎక్లార గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని చెన్నమ్మ కోరి అమ్మవారిని దర్శించుకుని…
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన
నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్‌ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్‌ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…
పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల…
సుల్తాన్‌పేట్‌లో SIR–2026పై గ్రామసభ
మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి…
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…
అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి
కంటేశ్వర్‌లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్‌కు హాజరు కావాలని కోరుతూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు…
భీంగల్‌లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు
భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్ పోసి బ్లేడ్ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…
జుక్కల్‌లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు
జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్‌కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…
ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం
హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ…
నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
కులమతాలకు అతీతంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్, ఆగస్టు 26: (E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ పట్టణంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఖిలా రోడ్డు నుంచి ప్రారంభమైన మిలాద్ ఉన్ నబీ ర్యాలీ ఉత్సాహభరితంగా కొనసాగింది. అనంతరం ఖిలా రోడ్డు, నెహ్రూ పార్క్‌లో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ…

