Khamam
పేదల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నత నేత జగ్జీవన్ రామ్
డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం…
వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలపై రైతులకు శిక్షణ
పాల్వంచ: సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ క్లస్టర్ పరిధిలోని కొత్తూరు గ్రామం పేటచెరువు వద్ద ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆధ్వర్యంలో “వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలు” అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.వ్యవసాయ విస్తరణ అధికారి జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, మండల వ్యవసాయ అధికారి పి. శంభోశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…
శ్రీ లీలామృత గ్రంథ పారాయణ సమాప్తి
ఘనంగా శోభాయాత్ర.. ఉత్సాహంగా దహీ హండి డోంగ్లి, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రచార్య సంస్థానం అంతర్గత తెలంగాణ ఉపపీఠము, కామారెడ్డి జిల్లా డోంగ్లి సంత సంఘ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిర్వహించిన శ్రీ లీలామృత గ్రంథ పారాయణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.జగద్గురు శ్రీ గారు రచించిన పవిత్ర శ్రీ లీలామృత గ్రంథాన్ని భక్తులు గత 21 రోజులుగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు….
నడిరోడ్డుపై బైక్ స్టంట్లు.. యువకుడిపై కేసు
ప్రమాదకర వీలింగ్‌కు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్న మఠంపల్లి పోలీసులు మఠంపల్లి, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). నడిరోడ్డుపై ద్విచక్రవాహనంతో ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న యువకుడిని మఠంపల్లి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మఠంపల్లి ప్రధాన చౌరస్తా నుంచి జాన్‌పాడు, మట్టపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో పర్వతం గోపీచంద్ (19) అనే యువకుడు ద్విచక్రవాహనంపై అత్యంత ప్రమాదకరంగా స్టంట్లు…
నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి
నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…
భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం
భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…
విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…
జుక్కల్ చౌరస్తాలో బస్సు ప్రమాదం
డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను…
జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి
ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…

