Khamam
ఆటోపై కూలిన భారీ వృక్షం.. ఐదుగురికి గాయాలు!
డ్రైవర్, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రుద్రూర్ (E6tv న్యూస్). రుద్రూర్–బోధన్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి ఆటోపై పడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన కలకలం రేపింది. బోధన్ వైపు వెళ్తున్న TS 16 UA 0344 నంబర్ గల ఆటోపై ఒక్కసారిగా భారీ వృక్షం కూలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో…
మట్టి మాఫియాపై ఎల్లారెడ్డి పోలీసుల కొరడా
అక్రమంగా మట్టి తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు సీజ్.. యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు ఎల్లారెడ్డి, నవంబర్ 11 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న ఆరు ట్రాక్టర్లను ఎల్లారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం (నవంబర్ 11) ఉదయం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని మీశన్పల్లి రోడ్డు సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి…
బుగ్గారం రైతుల ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి!
బీటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి పక్కా రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబకు వినతిపత్రం అందజేసిన చుక్క గంగారెడ్డి జగిత్యాల, నవంబర్ 09 (E6tv న్యూస్). బుగ్గారం గ్రామ రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక హక్కుల కార్యకర్త, గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జన…
ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం.. ప్రభుత్వ భూములకు రక్షణేదీ?
ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోని అధికారులు! కుందాపూర్‌లో చెరువులు, కుంటలు, గుట్టల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు ప్రభుత్వ భూములను కాపాడాలని సర్పంచ్ సాయిలు డిమాండ్ నవంబర్ 2న ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన ఇంటి నంబర్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా న్యాయం జరగలేదంటున్న అశోక్ ప్రజావాణికి ప్రధాన అధికారుల గైర్హాజరుపై విమర్శలు రుద్రూర్, నవంబర్ 10 (E6 టీవీ న్యూస్): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం కేవలం…
కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దినేష్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
వడ్డేపల్లి దినేష్ రెడ్డికి జిల్లా హ్యాండ్‌బాల్ పగ్గాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ ఎల్లారెడ్డి, నవంబర్ 07 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా వడ్డేపల్లి దినేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సదాశివనగర్ మండలం భూంపల్లిలోని జీపీ గార్డెన్స్‌లో నిర్వహించిన జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…
38 బీసీ కుల సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు
గాండ్ల సంఘం ఆత్మగౌరవ భవనానికి రూ.1.50 లక్షలు కేటాయింపు 38 బీసీ కుల సంఘాలకు మొత్తం రూ.88.50 కోట్ల నిధులు మంజూరు జీవో, ప్రొసీడింగ్ పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ శేరిలింగంపల్లి, నవంబర్ 07 (E6tv న్యూస్). తెలంగాణ రాష్ట్రంలోని 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా గాండ్ల, తెలికుల, దేవతెలికుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.1.50 లక్షల నిధులు మంజూరు…
అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ మాజీ బూత్ అధ్యక్షుడికి ఆర్థిక సాయం
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎన్నారై బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ ప్రతినెలా మందుల ఖర్చులకు సహాయం అందిస్తామని హామీ రుద్రూర్, నవంబర్ 07 (E6tv న్యూస్). అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్తకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ఎన్నారై కోనేరు శశాంక్. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన బీజేపీ మాజీ బూత్ అధ్యక్షుడు మూడ్ బాబు నాయక్ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం…
విప్లవ విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్
అమరత్వానికి 50 ఏళ్లు.. బోధన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ప్రదర్శన బోధన్, నవంబర్ 06 (E6TV న్యూస్). విప్లవ విద్యార్థి ఉద్యమాలకు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అందించిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు. శక్కర్ నగర్…
అన్నాసాగర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
8 మంది అరెస్ట్.. రూ.24,600 నగదు, 6 సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం యెల్లారెడ్డి, నవంబర్ 05 (E6tv న్యూస్) యెల్లారెడ్డి మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడి నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో భారీగా నగదు, వాహనాల స్వాధీనం పోలీసులు నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న వ్యక్తుల వద్ద నుంచి రూ.24,600 నగదు, ఆరు సెల్ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను…
యాదవ సమాజ అభ్యున్నతే విద్యావంతుల ఐక్య వేదిక లక్ష్యం
జిల్లా అధ్యక్షురాలిగా మంజుల యాదవ్ నియామకం నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు చలకని వెంకట్ యాదవ్ రాష్ట్ర రాజధానిలో హాస్టల్ భవన నిర్మాణానికి రూ.లక్ష విరాళం ప్రకటన నిజామాబాద్, నవంబర్ 05 (E6tv న్యూస్: శివ ఠాకూర్) యాదవ సమాజ అభ్యున్నతి, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా విద్యావంతుల ఐక్య వేదికను ఏర్పాటు చేసినట్లు ఆ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకని వెంకట్ యాదవ్ తెలిపారు. గురువారం నిజామాబాద్ ప్రెస్…
