Breaking News

నందిగామలో గౌడ హాస్టల్ భవనం ప్రారంభం

ప్రారంభోత్సవంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ పటాన్‌చెరు, అక్టోబర్ 17 (E6tv న్యూస్). సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ హాస్టల్…

Read Full News

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

దసరా నేపథ్యంలో రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ కోరుట్ల, అక్టోబర్ 17 (E6tv న్యూస్). దసరా పండుగ నేపథ్యంలో పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పట్టణ పరిధిలోని రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కొమ్ము తిరుపతి మాట్లాడుతూ.. పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేలా చూడటం పోలీసుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు….

Read Full News

రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలి

మాలలకు 22వ స్థానం నుంచి 20వ స్థానానికి మార్చాలి.. బాన్సువాడలో మాల సంఘం శాంతియుత దీక్ష బాన్సువాడ, అక్టోబర్ 16: (E6tv న్యూస్). రోస్టర్ పాయింట్ విధానానికి వ్యతిరేకంగా, మాలలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ మాల సంఘం ఆధ్వర్యంలో బాన్సువాడ హెడ్‌క్వార్టర్స్‌లో ఒకరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రస్తుతం రోస్టర్ పాయింట్ విధానంలో మాలలకు 22వ స్థానం కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో…

Read Full News

సిరిసిల్ల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

జర్నలిస్టులపై దాడుల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి బాధిత జర్నలిస్టులకు న్యాయం చేయాలి, దళిత జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు గంధం రాజేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో జర్నలిస్టులపై దాడులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని దళిత జర్నలిస్ట్ ఫోరమ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫోరమ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ సాయిలుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ (డీజేఎఫ్) అధ్యక్షుడు గంధం రాజేష్…

Read Full News

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జనసేన నాయకుడికి ఘన సన్మానం

మెట్‌పల్లి, అక్టోబర్ 16 (E6tv న్యూస్): మెట్‌పల్లి పట్టణంలోని వాసవీమాత ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ సీనియర్ నాయకులు గంగం అజయ్ కుమార్‌కు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మైలారపు రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం పెద్దలు మాట్లాడుతూ.. గంగం అజయ్ కుమార్ ఎల్లప్పుడూ ఆర్యవైశ్య సంఘానికి, వాసవీమాత ఆలయ అభివృద్ధికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు….

Read Full News

పలు అమ్మవారి మండపాలను సందర్శించిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, అక్టోబర్ 16 (E6 న్యూస్ ప్రతినిధి). దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని పలు అమ్మవారి మండపాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు మాద్రి పృథ్వీరాజ్ సందర్శించారు. శ్రీరామ్ నగర్, శివాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాద్రి…

Read Full News

ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ పట్టుబడిన ముగ్గురు అధికారులు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ముగ్గురు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ సేవలు అందించడానికి లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.

Read Full News

ప్రకృతి ఒడిలో బతుకమ్మ సందడి!

పోచారం ప్రాజెక్టు గట్టుపై పూల బతుకమ్మలు పేర్చిన చిన్నారులు.. కనువిందు చేసిన ప్రకృతి అందాలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 16 (E6tv NEWS). తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేళ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద ఆహ్లాదకరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రకృతి ఒడిలో పూల బతుకమ్మలను పేర్చుతూ చిన్నారులు, యువతులు సందడి చేశారు. పోచారం ప్రాజెక్టు పరిధిలోని పోచమ్మరాల్ గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు శుక్రవారం తెల్లవారుజామున ప్రాజెక్టు…

Read Full News

రుద్రూరులో మెగా వైద్య శిబిరం.. ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

రక్తదాన శిబిరానికి స్పందించిన పలువురు దాతలు రుద్రూరు, సెప్టెంబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల ఆధ్వర్యంలో, గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు….

Read Full News

రుద్రూరు 14వ వార్డులో జటిలంగా డ్రైనేజీ సమస్య

మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ.. పట్టించుకోవడం లేదని కాలనీ వాసుల ఆవేదన రుద్రూరు, అక్టోబర్ 16 (E6 న్యూస్: ప్రతినిధి). నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జవహర్ నగర్ కాలనీ 14వ వార్డులో డ్రైనేజీ సమస్య జటిలంగా మారింది. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపు లీకేజీ కారణంగా నీరు భారీగా ప్రవహిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాలనీలో గత మూడు రోజులుగా డ్రైనేజీ…

Read Full News