Breaking News

భీంగల్‌లో అక్రమ ఇసుక రవాణా.. రెండు ట్రాక్టర్లు పట్టివేత

అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా పోలీసుల తనిఖీలు భీంగల్, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). మున్సిపల్‌ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను భీంగల్‌ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. శనివారం వాగు నుంచి ఇసుక తరలింపునకు ఎమ్మార్వో ఆదేశాల మేరకు అనుమతులు ఉన్నప్పటికీ, ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లపై పోలీసులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం అందడంతో భీంగల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ…

Read More

గంగ తెప్ప మహోత్సవంలో తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు

ఏర్గట్ల,సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరంలో నిర్వహించిన గంగ తెప్ప మహోత్సవంలో ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని సంఘం అధ్యక్షుడు తొపారం రాజేశ్వర్‌ తెలిపారు. గంగపుత్రుల సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి గంగపుత్ర సంఘాల ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొర్తి గంగపుత్ర సంఘం సభ్యులు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని…

Read More

వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

అవకాశం వస్తే సంఘం అభివృద్ధికి తొలి ప్రాధాన్యత: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 6 (E6tv NEWS: ప్రతినిధి) శ్రీ వినాయక్ నగర్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొని, నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మామిడి రాజేందర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి నంగునూరి శ్రీనివాస్ గుప్తా (వాసు), కోశాధికారి అల్లా నగేష్ గుప్తా తదితరులు ప్రమాణ…

Read More

1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు

ఏర్గట్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు – భారీ బైక్ ర్యాలీ ఏర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)..తెలంగాణలో రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు కావస్తున్న సందర్భంగా ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలతో బైక్‌లపై ర్యాలీగా మండల కేంద్రంలోని ప్రధాన…

Read More

భక్తులకు మెరుగైన వసతులు.. భద్రాచలం అభివృద్ధికి మరింత ప్రాధాన్యత

రూ.1.50 కోట్లతో డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన భద్రాచలం, సెప్టెంబర్ 06:(E6tv NEWS: ప్రతినిధి). రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు.భక్తుల వసతి కోసం రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డార్మెటరీ హాల్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి…

Read More

పేదల సంక్షేమం కోసం శ్రమించిన మహోన్నత నేత జగ్జీవన్ రామ్

డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్వంచ, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ బీసీఎం రోడ్డులో దండోరా శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం…

Read More

వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలపై రైతులకు శిక్షణ

పాల్వంచ: సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ క్లస్టర్ పరిధిలోని కొత్తూరు గ్రామం పేటచెరువు వద్ద ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) ఆధ్వర్యంలో “వ్యవసాయంలో విభిన్న ఉపాధి అవకాశాలు” అనే అంశంపై నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.వ్యవసాయ విస్తరణ అధికారి జి. నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబురావు, మండల వ్యవసాయ అధికారి పి. శంభోశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ…

Read More

శ్రీ లీలామృత గ్రంథ పారాయణ సమాప్తి

ఘనంగా శోభాయాత్ర.. ఉత్సాహంగా దహీ హండి డోంగ్లి, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్రచార్య సంస్థానం అంతర్గత తెలంగాణ ఉపపీఠము, కామారెడ్డి జిల్లా డోంగ్లి సంత సంఘ సేవా కేంద్రం ఆధ్వర్యంలో గత 21 రోజులుగా నిర్వహించిన శ్రీ లీలామృత గ్రంథ పారాయణ కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.జగద్గురు శ్రీ గారు రచించిన పవిత్ర శ్రీ లీలామృత గ్రంథాన్ని భక్తులు గత 21 రోజులుగా భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు….

Read More

ముత్యాలమ్మ జాతర నేపథ్యంలో పోలీసుల అవగాహన సదస్సు

శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు: సీఐ చరమంద రాజు అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలకు గట్టి హెచ్చరిక హుజూర్‌నగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) స్థానిక ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని హుజూర్‌నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హుజూర్‌నగర్ పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజు, ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేలా…

Read More

నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ

ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…

Read More