Mahaboobnagar
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలురెండు కాళ్లు నుజ్జునుజ్జు.. ఆసుపత్రికి తరలింపు
మెట్పల్లి, అక్టోబర్ 07 (E6tv NEWS: ప్రతినిధి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్లు బస్సు టైర్ కిందపడి నుజ్జునుజ్జయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నాగపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు కొత్త బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా…..
SIR పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ
వర్ని, అక్టోబర్ 7: (E6tv NEWS ప్రతినిధి).SIR పేరుతో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతూ అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ CEC జ్ఞానేశ్వర్ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన…
వికారాబాద్‌లో ఇండియా కూటమి భారీ నిరసన..
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ నాయకత్వంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో…
మానాల అభివృద్ధికి రూ.14 కోట్లతో వివిధ పనులు
సూరమ్మ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పామ్ఆయిల్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మహిళలు, యువత, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి కమ్మర్పల్లి, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్….
ధాన్యం దళారుల సిండికేట్‌పై రైతుల ఆగ్రహం
రేట్లు తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు క్వింటాకు రూ.3,800 వరకు ధర పలుకుతుండగా తగ్గింపుపై రైతుల ఆవేదన చందూర్, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాకు సుమారు రూ.3,800 వరకు ధర పలుకుతుండటంతో రైతులు ఊరట చెందుతున్న తరుణంలో.. కొందరు ధాన్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు…
రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన-శిక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం…
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సమాన పనికి సమాన వేతనం అందించాలి: సాకే హరి అనంతపురం, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందేలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…
సుధాకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిబాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్ మృతదేహాన్ని…
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం చేయడమే లక్ష్యం
ముంబయి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉన్నతస్థాయి బృందం ఆదివారం ముంబయిలో పర్యటించింది. ముంబయిలోని ఆంధ్ర మహాసభలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను కమిటీ సభ్యులు గుర్తించి సత్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ అడ్లంకి దయాకర్, ప్రొఫెసర్…
మాదిగలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
రైతులకు నిరంతర విద్యుత్, వరికి మద్దతు ధర కల్పించాలి జుక్కల్, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు,…
