Mahaboobnagar
పాఠశాలల ఆరోగ్యం బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నిజామాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (RBSK)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ RBSK మొబైల్ హెల్త్ టీంలు ప్రతి పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆరు నెలలకు ఒకసారి…
హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన
హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్…
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
హైదరాబాద్, ఆగస్టు 17: (E6tv NEWS: ప్రతినిధి) జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపకుండా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం చట్టపరమైన మార్గాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,…
కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం…
భీంగల్ బ్రహ్మంగారి దేవాలయ భూమి రికార్డులపై తెల్పాలని విశ్వబ్రాహ్మణ సంఘం వారు ప్రజావాణిలో ఫిర్యాదు..
భీంగల్ ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్) భీంగల్ గ్రామంలోని నంది గల్లి బస్సు డిపో వెంకన్న ఉన్న బ్రహ్మంగారి దేవాలయానికి సంబంధించిన భూమి రెవెన్యూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోనికి తీసుకురావాలని విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినారు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యుల వివరణ ప్రకారము సర్వేనెంబర్ 675లోని 6.0800 ఎకరాల భూమి పాత రెవిన్యూ రికార్డు లోనికి శ్రీ బ్రహ్మం గారి దేవాలయానికి సంబంధించిన భూమి…
కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌పై స్టే.. బీఆర్ఎస్ ధర్నా వెనుక అసలు కథ ఏమిటి?
పేదింటి ఆడబిడ్డల పెళ్లి సాయంపై న్యాయపరమైన ప్రతిష్టంభన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో లబ్ధిదారుల్లో ఆందోళన.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు పథకం రద్దు కాలేదా? స్టే మాత్రమేనా? అసలు వివాదం ఏమిటి? నిజామాబాద్, ఆగస్టు 17: E6tv NEWS (శివ ఠాకూర్). తెలంగాణ లో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాలు ప్రస్తుతం రాజకీయ, న్యాయపరమైన చర్చకు కేంద్రంగా మారాయి. ఈ పథకాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ఇటీవల మధ్యంతర…
మాజీ సర్పంచ్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న హన్మంత్ షిండే
పిట్లం, ఆగస్టు 16: (E6 tv NEWS: ప్రతినిధి) పిట్లం మండలం రాంపూర్ (కలాన్) మాజీ సర్పంచ్ మందాడి నారాయణ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే హాజరై నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…
బాడాపహాడ్ కమాన్ నిర్మాణానికి భూమి పూజ
వర్ని, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి) వర్ని మండల కేంద్రంలోని బాడాపహాడ్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మించనున్న బాడాపహాడ్ కమాన్ (స్వాగత తోరణం) నిర్మాణ పనులకు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి భూమి పూజ చేశారు.స్థానిక నాయకులతో కలిసి ఆయన కమాన్ నిర్మాణ స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. బాడాపహాడ్ చౌరస్తా వద్ద నిర్మించనున్న ఈ స్వాగత తోరణం వర్ని పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నాయకులు తెలిపారు. ఈ…
బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
బాల్కొండ నియోజకవర్గంలో 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరిక కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్: ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి తిరిగి గాడిన పడాలంటే…
బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి
బిచ్కుంద, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి).జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె జోనిట–దాస్ వివాహ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై కాబోయే వధూవరులు జోనిట–దాస్‌లను ఆశీర్వదించి, వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ విందులో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ…

