Mahaboobnagar
నిజామాబాద్ జిల్లాలో పోక్సో కేసులపై పోలీస్ కమిషనర్ సమీక్ష
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి. బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ పి. సాయి చైతన్య నిజామాబాద్, ఆగస్టు 16:(E6tv NEWS: శివ ఠాకూర్). జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు, కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన…
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహానికి బయలుదేరిన మల్లాపూర్ గ్రామ ప్రజలు
డోంగ్లీ, ఆగస్టు 16: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మల్లాపూర్ గ్రామం నుంచి జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారి కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు గ్రామ ప్రజలు ఆదివారం బయలుదేరారు.ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించేందుకు మల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన దంపతుల జీవితం సుఖసంతోషాలతో సాగాలని…
జోనిట వివాహ విందుకు మారేపల్లి గ్రామ ప్రజలకు ఆత్మీయ ఆహ్వానం
డోంగ్లీ, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి) డోంగ్లీ మండలం మారేపల్లి గ్రామ ప్రజలకు స్థానిక సర్పంచ్ గాయక్వాడ్ శ్రీధర్ ఆత్మీయ ఆహ్వానం పలికారు. జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు కుమార్తె జోనిట వివాహ విందు కార్యక్రమం ఆగస్టు 16, 2026 ఆదివారం రోజున డీబీఎల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మారేపల్లి గ్రామ ప్రజలందరూ వివాహ విందు కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని సర్పంచ్ శ్రీధర్ కోరారు. నూతన దంపతుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో…
అవల్‌గావ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
మద్నూర్, ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం అవల్‌గావ్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాన్యబాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ గ్రామ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.గ్రామాభివృద్ధిలో భాగస్వాములైన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు,…
ఎర్గట్ల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఎర్గట్ల, ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన శ్రీమతి జుంగాల గంగు, శ్రీమతి హుస్సేన్ బీకి వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎర్గట్ల తహసీల్దార్, డిప్యూటీ…
తోట వారి వివాహ విందుకు మేనూర్ గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం
కందర్పల్లి DBL గ్రౌండ్‌లో ఆగస్టు 16న వివాహ విందు మేనూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి మేనూర్ గ్రామ ప్రజలందరూ హాజరై వధూవరులను ఆశీర్వదించాలని పటేల్ గ్రామ సర్పంచ్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కందర్పల్లి–బిచ్కుంద రోడ్డులోని DBL గ్రౌండ్‌లో తోట వారి వివాహ…
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…
మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు
మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
ఉత్తమ సేవల అవార్డు అందుకున్న మద్నూర్ కానిస్టేబుల్ విట్టల్
మద్నూర్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). ఉత్తమ సేవలు అందించినందుకు మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌కు ప్రశంసా పత్రం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర చేతుల మీదుగా విట్టల్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసులో నిందితులను గుర్తించడంలో కానిస్టేబుల్ విట్టల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే మద్నూర్ మండల…
విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు
TSNPDCL ఏఈ సంజీవ్ కుమార్‌కు ప్రశంసా పత్రం నిర్మల్ ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిపేష్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఇందులో భాగంగా TSNPDCLలో ఏఈగా…

