Mahaboobnagar
వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపిన ‘పోచారం భాస్కరన్న భరోసా’
ముగ్గురికి కృత్రిమ చేయి, కాళ్ల అందజేత.. మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తాం: పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 1: (E6tv NEWS: ప్రతినిధి) అంగవైకల్యం జీవితానికి అడ్డంకి కాకూడదనే మానవతా దృక్పథంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగులకు అండగా నిలుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ డీసీసీబీ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి…
హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత
రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మరింత ప్రయోజనం
లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన.. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి… నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్….
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి
– షేక్ మతిన్ రుద్రూర్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) రుద్రూర్ మండల కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు షేక్ మతిన్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రజల కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని షేక్ మతిన్ పేర్కొన్నారు….
బాబాపూర్‌లో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్‌పై అవగాహన సమావేశం
గ్రామ అభివృద్ధి పనుల గుర్తింపుపై మహిళలు, రైతులు, ప్రజలకు అవగాహన భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిది) భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో వికసిత్ గ్రామపంచాయతీ ప్లాన్ (VGPP) తయారీ కోసం మహిళలు, రైతులు, గ్రామస్తులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులను గుర్తించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ మాట్లాడుతూ…..
భీంగల్ 10వ వార్డులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి )భీంగల్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బదిరే నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే లత, జేజే నర్సయ్య, కౌన్సిలర్ నాగేంద్రబాబు, అనంతరావు, తోట సతీష్, సంధ్య నాయక్, 10వ వార్డు అధ్యక్షుడు పత్రి రాజు, వార్డు ఆఫీసర్…
బాసర పాదయాత్రికులకు బచ్చు గోపాల్ సెట్ కుటుంబం అల్పాహారం
రుద్రూర్లో సుమారు 60 మంది పాదయాత్రికులకు ఆతిథ్యం రుద్రూర్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల బచ్చు గోపాల్ సెట్ రైస్ మిల్లులో బాసర పాదయాత్రికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. బండ రెంజల్ గ్రామంలోని రానాందేవ్ మందిరం నుంచి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం గంగారం మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రికులు రుద్రూర్ చేరుకోవడంతో బచ్చు…
భైంసాలో రేపటి ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు
అనివార్య కారణాలతో సెప్టెంబర్ 30న జరగాల్సిన కార్యక్రమం వాయిదా భైంసా, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 30న భైంసా క్యాంప్ కార్యాలయంలో జరగాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల (IPS) పర్యవేక్షణలో ప్రతి బుధవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అనివార్య పరిస్థితుల కారణంగా…
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు
ఎర్గట్లలో ఉత్సాహంగా నిర్వహణ.. విజేతలకు జిల్లా స్థాయి పోటీలకు అవకాశం ఎర్గట్ల, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎర్రగట్ల మండల కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం మండల స్థాయి క్రీడా పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ పోటీ, 100 మీటర్ల పరుగు పందెం, స్పూన్ అండ్ మార్బుల్,…
ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ వివక్ష చూపుతున్నారు
ఒక సంవత్సరం నుంచి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపణలు రుద్రూరు, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఐదుగురు వార్డు సభ్యులపై సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్ వివక్ష చూపుతున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట వారు విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గత ఏడాది కాలంగా తమ తమ వార్డుల్లో ప్రజలు…
