Mahaboobnagar
రైతుల పొట్ట కొడుతున్న మిల్లర్ల సిండికేట్?
కోటగిరిలో అన్నదాతల ఆవేదన.. ఓపెన్ మార్కెట్ వ్యాపారులను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు కొనుగోలు సమయంలో రకాల పేరుతో ధరల్లో కోత.. విక్రయాల సమయంలో సన్న బియ్యానికి భారీ ధరలు రైతులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి కోటగిరి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). కష్టపడి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదని, స్థానిక రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓపెన్ మార్కెట్ వ్యాపారులను కొనుగోళ్లు చేయకుండా అడ్డుకుంటున్నారని కోటగిరి…
శివపూర్‌లో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: నాయకులు ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం కల్పిస్తున్న…
ఎల్లారెడ్డిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి పట్టణంలోని ఏఎంసీ మార్కెట్ కమిటీ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగం గంగారాం మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, మద్దతు ధర పొందాలని…
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమం
ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలి – బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి బోధన్, అక్టోబర్ 24:(E6tv NEWS). బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేబీ ప్రొడక్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఐసీడీఎస్ బోధన్…
ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకారం.. ఎమ్మెల్యేకు, గ్రామ పెద్దలకు జవాన్ల కృతజ్ఞతలు అక్బర్ నగర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). దేశ రక్షణలో నిరంతరం సేవలందిస్తున్న ఆర్మీ జవాన్లకు అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులకు అక్బర్ నగర్ గ్రామానికి చెందిన జవాన్లు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన సుమారు 10 నుంచి 20 మంది వరకు ఆర్మీ జవాన్లు దేశ…
విమర్శలకు మౌనమే సమాధానం.. ప్రజాసేవే పోచారం బలం!
బాన్సువాడ రాజకీయాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శైలి.. తండ్రి బాటలో తనయులు బాన్సువాడ, అక్టోబర్ 23 (E6tv న్యూస్). రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా సంయమనంతో వ్యవహరించడం, ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగడం తన రాజకీయ శైలిగా భావించే నాయకుల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒకరని ఆయన అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. ప్రత్యర్థుల వ్యాఖ్యలకు వెంటనే స్పందించకుండా మౌనంగా ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉండటానికే ప్రాధాన్యత…
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బందికి వ్యాసరచన పోటీలు ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం ఎల్లారెడ్డి, అక్టోబర్ 23 (E6tv న్యూస్). పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ పరిధిలోని సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వ్యాసరచన పోటీల్లో ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం…
VDC కమిటీల రద్దుకు మోకుదెబ్బ ఆధ్వర్యంలో ఐక్య ఉద్యమాలు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం – అమరవేణి నర్సాగౌడ్ ఆర్మూర్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). VDC గ్రామ అభివృద్ధి కమిటీలను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు. కమిటీల పేరుతో గీత కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయని…
కరెంట్ కోతలు – నీటి ఎద్దడి: రైతులకు తప్పని పంట నష్టం భయం!
తెలంగాణలో నిరంతర విద్యుత్ కోతలు, సాగునీటి కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లముందే చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైపూర్ మండలం మిట్టపల్లిలో ఎండిపోతున్న పొలానికి ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తుండగా, వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతలను తట్టుకోవడానికి డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకుంటున్నారు. డీజిల్ ఖర్చు తమకు అదనపు భారంగా మారుతోందని, పంటల దిగుబడి తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు….
గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి
నాణ్యతలో రాజీ వద్దు.. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించాలి: ప్రత్యేక అధికారి హనుమంతరావు కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన ప్రత్యేక అధికారి నిజామాబాద్, అక్టోబర్ 23 (E6tv న్యూస్). గోదావరి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, పుష్కరాల ప్రత్యేక అధికారి హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్…
