Breaking News

ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లోకి మార్చాలి

ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించాలి – జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు రుద్రూర్, అక్టోబర్ 23 (E6tv NEWS). ముదిరాజులను ప్రస్తుత బీసీ-డీ జాబితా నుంచి బీసీ-ఏ జాబితాలోకి మార్చాలని ముదిరాజు సంఘం జిల్లా నాయకుడు బైండ్ల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజుల రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మరింత ప్రయోజనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తే ఆ వర్గమంతా ప్రభుత్వానికి అండగా ఉంటుందని…

Read Full News

పోతంగల్‌లో పాత కాంగ్రెస్ కార్యకర్తల దారి ఎటు?

సొసైటీ డైరెక్టర్ల ఎంపికపై అసంతృప్తి? అధిష్టానం జోక్యం చేసుకోవాలని కార్యకర్తల డిమాండ్‌! పోతంగల్, అక్టోబర్ 23:(E6tv NEWS). నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో సొసైటీ డైరెక్టర్ల ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మాజీ జెడ్పీటీసీ హెగ్డోలి శంకర్‌కు సొసైటీ చైర్మన్ పదవి ఖరారైనట్లు సమాచారం. మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండే సొసైటీలో పోతంగల్ కేంద్రం నుంచి ముగ్గురు డైరెక్టర్లకు ప్రాతినిధ్యం కల్పించే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ…

Read Full News

ఎల్లారెడ్డి యువకుడికి జాతీయ స్థాయి బాధ్యత!

ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి నియామకం ఎల్లారెడ్డి, అక్టోబర్ 23: (E6tv NEWS). ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన యువకుడు నాగరం రణదీప్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. మిసన్‌పల్లికి చెందిన రణదీప్ రెడ్డి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం (AILSF) 2027–2028 నూతన కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాగరం నరసింహ రెడ్డి కుమారుడైన రణదీప్ రెడ్డి హైదరాబాద్‌లో బీఏ పూర్తి చేసి, ప్రస్తుతం…

Read Full News

మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసిన మాద్రి పృథ్వీరాజ్. పటాన్‌చెరు, అక్టోబర్ 22 (E6tv NEWS). విజయదశమి, దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావుకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగ సందర్భంగా పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకోవడం…

Read Full News

బీజేపీ ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గానికి నియామక పత్రాల అందజేత

పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి నిజామాబాద్, అక్టోబర్ 22 (E6tv NEWS). నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా ఓబీసీ మోర్చా నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా నూతన పదాధికారులు, కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ…

Read Full News

నిజామాబాద్ రీజియన్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సదుపాయం వినియోగించుకోవాలి నిజామాబాద్, అక్టోబర్ 22 (E6 TV NEWS). నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, అలాగే నగరాల నుంచి తిరిగి గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలు టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్  ఎస్.వి.జి. కృష్ణమూర్తి సూచించారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్రణాళిక చేసుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in…

Read Full News

సౌదీలో మృతి చెందిన పశ్చిమ బెంగాల్ వాసి మృతదేహం తరలింపునకు SATA చొరవ

భారత రాయబార కార్యాలయం నుంచి NOC ప్రక్రియ పూర్తి.. కార్గో ఏర్పాట్లు పెండింగ్ జెడ్డా, సౌదీ అరేబియా (E6tv NEWS): సౌదీ అరేబియాలో సహజ మరణం చెందిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహమ్మద్ మజ్రుల్ హక్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) చొరవ తీసుకుంది. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియ పూర్తికాగా, ప్రస్తుతం కార్గో ఏర్పాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మహమ్మద్ మజ్రుల్ హక్ ఇస్సామ్ కబ్బానీ గ్రూప్‌లో ఉద్యోగిగా…

Read Full News

తెలంగాణలో 95% తగ్గిన వర్షపాతం!

ఈ ఏడాది అక్టోబర్‌లో తెలంగాణ తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నెల 1 నుంచి 21వ తేదీ వరకు సాధారణంగా కురవాల్సిన 75.6 మిమీ వర్షపాతానికి గాను కేవలం 3.5 మిమీ మాత్రమే వర్షం నమోదుకావడంతో ఏకంగా 95 శాతం లోటు నమోదైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పంటల సంరక్షణ, నీటి నిల్వల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Read Full News

వర్ని బస్టాండ్‌ వద్ద ఐదు వరకు బెల్ట్‌ షాపులు!

తెల్లవారుజాము 3 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా మద్యం విక్రయాలా? బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనపు వసూళ్ల ఆరోపణలు మహిళా ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు.. ఇరిగేషన్‌ స్థలాల నిర్మాణాలపైనా ప్రశ్నలు వర్ని, అక్టోబర్ 22 (E6tv న్యూస్). నిజామాబాద్‌ జిల్లా వర్ని బస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణపై స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌ ప్రాంగణానికి ఆనుకొని సుమారు ఐదు వరకు బెల్ట్‌ షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని,…

Read Full News

ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

మృతురాలి వయస్సు 40–45 ఏళ్ల మధ్య ఉండవచ్చని అంచనా.. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి ఇబ్రహీంపట్నం, అక్టోబర్ (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదూరు గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కాలువ నీటి ప్రవాహంలో మృతదేహం కొట్టుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆమె ఎరుపు…

Read Full News