Mahaboobnagar
ఎస్సారెస్పీలో 46 టీఎంసీల నీళ్లున్నా పంటలు ఎండుతున్నాయి
2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు 6 టీఎంసీలు విడుదల చేయాలి అన్ని ఎత్తిపోతల పథకాలను పూర్తి సామర్థ్యంతో నడపాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (ఎస్సారెస్పీ)లో సుమారు 46 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. సుమారు 2 లక్షల ఎకరాల పంటలను కాపాడేందుకు వెంటనే 6 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని…
పాల్వంచ–కొత్తగూడెం వేదికగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్
సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు పోటీలు దేశవ్యాప్తంగా 300–400 మంది సీనియర్ క్రీడాకారుల రాక పాల్వంచ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం జంట నగరాల వేదికగా తొలిసారిగా ఆల్ ఇండియా సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, శ్యామల గోపాలం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి సహకారంతో సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల…
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి ‘సై’
శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు. గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్…
గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి: డీఎస్పీ ఆదినారాయణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్, మున్సిపల్ శాఖల నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సూచించారు.గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి ముందుగా సంబంధిత పోలీస్, మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై, ఇరుకైన వీధుల్లో, వివాదాస్పద స్థలాల్లో లేదా ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు. మండపం, స్టేజ్,…
భూ రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
సీతాయిగూడెంలో రీ-సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ అర్హులైన భూహక్కుదారులకు పాస్‌బుక్‌లు పొందే అవకాశం చండ్రుగొండ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).భూ రీ-సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగవంతంగా, పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ…
వ్యవసాయానికి 18 గంటలు విద్యుత్ ఇవ్వాలని వినతి
మద్నూర్, సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి) వ్యవసాయానికి రోజుకు 18 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సుల్తాన్‌పేట్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. ఈ మేరకు గురువారం మేనూర్‌లోని అదనపు సహాయక ఇంజినీర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వ్యవసాయ బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయానికి కనీసం…
దొరలను గడగడలాడించిన వీర వనిత చాకలి ఐలమ్మ
ముధోల్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).తెలంగాణ సాయుధ పోరాటంలో దొరల అరాచకాలను ఎదిరించి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ అన్నారు.ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోతన్న యాదవ్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చూపిన తెగువ,…
‘మా నీళ్లు ఏపీకి పోతున్నాయ్’: రైతులు!
నాగర్‌కర్నూల్: తెలంగాణలో సాగునీరు, కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆందోళన చెందుతున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామానికి సమీపంలోని కొండారెడ్డిపల్లి వద్ద రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి భారీ రాస్తారోకో చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఆవేదన & మండిపాటు: సాగునీరు, వ్యవసాయ విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించి తమ పంటలను కాపాడాలని, లేకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డు అందుకున్న అడ్వకేట్ యరగాని సోనీ
జూనియర్ న్యాయవాదిగా ప్రతిభకు గుర్తింపు హుజూర్‌నగర్,సెప్టెంబర్ 10: (E6tv NEWS: ప్రతినిధి). నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన అడ్వకేట్ యరగాని సోనీ ప్రతిష్టాత్మక కాళోజీ నంది అవార్డును అందుకున్నారు. కాళోజీ తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్ అసోసియేషన్, కాళోజీ తెలంగాణ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ న్యాయవాదుల…
బీఆర్ఎస్‌లో భారీ చేరికలు
కారెక్కిన సీపీఐ సీనియర్ నేత కిలారు ప్రసాద్ పాత కొత్తగూడెం 11వ డివిజన్ నుంచి సుమారు 100 మంది కార్యకర్తల చేరిక 100 మోటార్‌సైకిళ్లతో భారీ ర్యాలీగా తెలంగాణ భవన్‌కు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కొత్తగూడెం, సెప్టెంబర్ 9:(E6tv NEWS: ప్రతినిధి). కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీలో బుధవారం భారీగా చేరికలు జరిగాయి. ఉమ్మడి సుజాతనగర్ గ్రామపంచాయతీకి చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు కిలారు ప్రసాద్ ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాత…

