Mahaboobnagar
హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఘర్షణ.. కత్తితో యువకుడిపై దాడి కోరుట్ల, అక్టోబర్ 21 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో జరిగిన హత్యాయత్నం ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పండుగ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. అర్బన్ కాలనీకి చెందిన గుద్దేటి రాజేందర్ (43) తన కాలనీలో దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…
దేవి నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ముంబాజీపేట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు.. గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ముంబాజీపేట్ గ్రామంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. శ్రీ జగన్మాత సేవా సమితి సభ్యుల ఆహ్వానం మేరకు గ్రామంలోని అమ్మవారి మండపాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాజాల సురేందర్ మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి…
అమ్మవారి లడ్డూకు రూ.25,555.. మణిహారానికి రూ.24,100!
భక్తిశ్రద్ధల నడుమ దుర్గాభవాని అమ్మవారి ప్రసాదాల వేలం పది అవతారాల్లో అమ్మవారి దర్శనం.. చీరల వేలంలో భక్తుల పోటాపోటీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (E6tv న్యూస్ ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి 4వ వార్డులో త్రినేత్రి భవాని మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాభవాని అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి సమర్పించిన పవిత్ర ప్రసాదాలు, చీరలు, మణిహారం వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు….
పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య నిజామాబాద్, అక్టోబర్ 21 (E6tv న్యూస్: శివ ఠాకూర్). శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని అమరవీరుల…
మీనూరులో దసరా బంగారం సందడి
జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకున్న గ్రామస్తులు మీనూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మీనూరు గ్రామంలో విజయదశమి పండుగ సందర్భంగా దసరా బంగారం సందడి నెలకొంది. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆప్యాయతను చాటుకున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ గ్రామంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది. జమ్మి ఆకులను…
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
రుద్రూర్, అక్టోబర్ 21 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో కీ.శే. ఇందూరు జగన్ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం 10 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. జగన్ మోహన్ కుమారులు ఇందూరు శ్రీధర్, శ్రీకాంత్‌ల సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూరు శ్రీధర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు…
బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జిగా షేక్ మతీన్ నియామకం
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటన రుద్రూర్, అక్టోబర్ 21 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ క్యాంపు గ్రామానికి చెందిన షేక్ మతీన్‌కు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయనను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించినట్లు షేక్ మతీన్ సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా షేక్ మతీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ…
బాన్సువాడలో ఘనంగా రావణదహనం
కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 21 (E6tv న్యూస్). విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్…
దసరా పండుగ రోజునే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆడపడుచుల ఆవేదన
తమ స్థలానికి రక్షణ కల్పించాలని వేడుకోలు.. న్యాయం జరగకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక రుద్రూరు, అక్టోబర్ 21 (E6tv న్యూస్). దసరా పండుగ పూట కూడా తమకు వేధింపులు తప్పడం లేదని, తమ స్థిరాస్తి విషయంలో న్యాయం చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట అక్బర్ నగర్ గ్రామానికి చెందిన మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ప్రాణహాని ఉందని, జీవించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు….
హోంగార్డు షేక్ ఛోటు మృతి
ఎల్లారెడ్డి, అక్టోబర్ 18 (E6tv న్యూస్): కామారెడ్డి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లింగంపేట గ్రామానికి చెందిన షేక్ ఛోటు ఆదివారం సాయంత్రం మృతి చెందారు. షేక్ ఛోటు మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల్లో విషాదం నెలకొంది. ఆయన అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లింగంపేట గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
