Telangana
ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఈసీఐ కీలక అఫిడవిట్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి దాఖలైన ఎలక్షన్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు ఉపఎన్నిక నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టులో ప్రమాణపత్రం (అఫిడవిట్) దాఖలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయాన్ని సవాలు చేస్తూ పి. విజయారెడ్డి వేసిన పిటిషన్ ఇంకా విచారణలో ఉన్నందున ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఆమె కోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఎన్నికల ప్రామాణికతపై పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు ఉపఎన్నికలు…
SIR పేరుతో ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ
వర్ని, అక్టోబర్ 7: (E6tv NEWS ప్రతినిధి).SIR పేరుతో ఓట్లలో అవకతవకలకు పాల్పడుతూ అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ CEC జ్ఞానేశ్వర్ తీరును నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమంగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన…
వికారాబాద్‌లో ఇండియా కూటమి భారీ నిరసన..
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ నాయకత్వంలో ఎన్టీఆర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో…
ఎర్రవల్లి భూముల్లో 45 ఎకరాల వ్యత్యాసం
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నంబర్ 325లో అధికారిక రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాల్సి ఉండగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో తెలిపారు. రికార్డులకు, క్షేత్రస్థాయి పరిశీలనకు మధ్య ఉన్న 45 ఎకరాల భూమి ఎక్కడ ఉందో తేల్చాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ ఎర్రవల్లి మరియు వెంకటాపురం గ్రామాల పరిధిలో సమగ్ర…
ఆర్టీసీ బస్సు–టాటా మ్యాజిక్ ఢీ.. విద్యార్థినులకు గాయాలు
కోరుట్ల, అక్టోబర్ 6 (E6tv NEWS : ప్రతినిధి). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు, విద్యార్థులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. మరో వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన బస్సుగాయపడిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స… స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హర్షిత, మోక్షితలు పాఠశాల ముగిసిన అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో కథలాపూర్ మండలంలోని…
మానాల అభివృద్ధికి రూ.14 కోట్లతో వివిధ పనులు
సూరమ్మ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పామ్‌ఆయిల్ సాగుతో రైతులకు అధిక ఆదాయం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మహిళలు, యువత, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతి రెడ్డి కమ్మర్‌పల్లి, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మానాల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్….
ధాన్యం దళారుల సిండికేట్‌పై రైతుల ఆగ్రహం
రేట్లు తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు క్వింటాకు రూ.3,800 వరకు ధర పలుకుతుండగా తగ్గింపుపై రైతుల ఆవేదన చందూర్, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి).ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యానికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాకు సుమారు రూ.3,800 వరకు ధర పలుకుతుండటంతో రైతులు ఊరట చెందుతున్న తరుణంలో.. కొందరు ధాన్యం దళారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు…
సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం – అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS
“PAUSE FOR SAFETY” – ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి నిర్మల్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి). అక్టోబర్ 2026ను జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంగా పాటిస్తున్న సందర్భంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రత్యేక పోస్టర్లను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయం (DPO), నిర్మల్‌లో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, IPS ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను…
మాజీ మావోయిస్టులకు కవిత పిలుపు..
జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవ చేసేందుకు తమ పార్టీ తెలంగాణ రక్షణ సేనలోకి రావలసిందిగా ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పర్యటనలో భాగంగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, లోకం మార్పు కోసం పోరాడిన మాజీ మావోయిస్టులకు తమ పార్టీ ఒక సరైన వేదిక కాగలదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను…
గోషామహల్‌లో ఓట్ల తొలగింపు కుట్ర: అసదుద్దీన్
హైదరాబాద్‌లోని గోషామహల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ నంబర్లు 28, 30, 127లలో 2002 సంవత్సరం నుంచి ఓటు హక్కు కలిగిన ముస్లింల పేర్లను తొలగించేందుకు ముందస్తుగా ప్రింట్ చేసిన ఫారం-7 దరఖాస్తులను సమర్పిస్తున్నారని విమర్శించారు. ఒకే వ్యక్తి 122 ఫారం-7…
