Telangana
సీఎంగా తొలిసారి సిరిసిల్లకు రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం కరీంనగర్ నుంచి సిరిసిల్ల చేరుకోనున్న సీఎం, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాలను సందర్శిస్తూ బహిరంగ సభా వేదిక వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో సిరిసిల్లలో నేతన్న బజార్, రూ.200 కోట్లతో…
రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ దాడి: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఎన్నికల బరిలో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపిని ఓడించడం సాధ్యం కాదనే నైరాశ్యంతోనే సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య స్తంభాలపై బురదజల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం, సీఈసీ, ఈవీఎంలపై కాంగ్రెస్ పదేపదే నిందలు వేయడం సబబు…
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో రైతులకు మరింత ప్రయోజనం
లక్కంపల్లి సెజ్‌లో అనువైన స్థలాల పరిశీలన.. రైస్ బ్రాన్ ఆయిల్, సోయా పరిశ్రమల ఏర్పాటుకు కృషి… నిజామాబాద్, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్). నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం నందిపేట మండలం లక్కంపల్లి సెజ్ పరిసర ప్రాంతాల్లో ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆయన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్….
రేవంత్ సిరిసిల్ల వ్యూహం..
సిరిసిల్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులతో నేరుగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిఫెన్స్‌లో పడ్డారనే చర్చ సాగుతోంది. సుదీర్ఘకాలంగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్, నియోజకవర్గంలో జరిగిన శాశ్వత అభివృద్ధి పనులను చెప్పుకోవడానికి బదులు ఆయన పీఆర్ టీమ్ ద్వారా వ్యక్తిగత సహాయాల ప్రచారాన్ని తెరపైకి తీసుకురావడం అభద్రతా భావానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల స్థానిక మహిళా క్రికెటర్‌కు సాయంతో పాటు, సీఎం రేవంత్…
జీవో 150 ఎఫెక్ట్:తెలంగాణ విద్యార్థులకు అన్యాయం
వైద్య ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నం.150 తెలంగాణ విద్యార్థులకే నష్టదాయకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా నాలుగేళ్ల చదువు ఆధారంగా స్థానికత కేటాయించే ఈ నిబంధన వల్ల, ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలోనే చదివిన జల్ల అంకిత అనే విద్యార్థిని ఇంటర్ ఏపీలో పూర్తి చేయడంతో ‘నాన్-లోకల్’గా మిగిలిపోయింది. ఈ విషయమై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 150 ప్రకారం వరుస నాలుగేళ్ల చదువు…
గచ్చిబౌలిలో పోలీసులపై RMP డాక్టర్ దాడి: కేసు నమోదు
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ అపోలో ఆసుపత్రి సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక RMP డాక్టర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. 112 ఎమర్జెన్సీ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో నిందితుడు వాగ్వాదానికి దిగి, భౌతిక దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతున్న సమయంలో హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో సదరు వ్యక్తి మాటామాటా పెంచుకున్నాడు….
అమీర్‌పేట హత్య కేస్: పెళ్లి ప్రస్తావనే ప్రాణం తీసిందా?
హైదరాబాద్‌లోని అమీర్‌పేట ఓయో లాడ్జ్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన ప్రియుడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్రైడ్ లాడ్జ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన బేగరి శిరీష (34), అవుసలపల్లి శ్రీనివాస్ (38)లకు గతంలోనే పరిచయం ఉంది. 2016లోనే విడాకులైన శిరీష నగరంలో కస్టమర్ కేర్ సెంటర్‌లో పనిచేస్తోంది. ఆమెను వివాహం…
టీజీ ఆర్టీసీ గుర్తుల వివాదం హైకోర్టు జోక్యం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్‌టీసీ) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల గుర్తు కేటాయింపు వివాదంలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ ఎన్నికల్లో తమకు గతంలో ఉన్న ‘విల్లు-బాణం’ గుర్తుకు బదులుగా ‘నిచ్చెన’ గుర్తును కేటాయించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు….
తెలంగాణ ఓటర్ల సవరణ ప్రక్రియ పూర్తి: 48.88 లక్షల మందికి చోటు
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 48,88,076 మందిని ఓటర్ల తుది జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జాబితాలో పారదర్శకతను పెంచేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితాలోని తప్పులు, సాంకేతిక సమస్యల ఆధారంగా మొత్తం 92,88,180 నోటీసులు జారీ చేయగా, ఇప్పటికే 88,52,173 నోటీసులను ఓటర్లకు అందజేశారు. ఈఆర్‌ఓలు, సహాయ ఈఆర్‌ఓల పర్యవేక్షణలో…
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
తెలంగాణలో త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం రాత్రి ఈ వివరాలను ప్రకటన రూపంలో విడుదల చేశారు. కాగా, 2027 మార్చిలో ఖాళీ కానున్న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు…
