Breaking News

భీంగల్‌లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

భీంగల్, ఆగస్టు 21:(E6tv NEWS:ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డులోని మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య…

Read More

రైల్లో 24.3 కిలోల ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకుల అరెస్ట్

నిజామాబాద్, ఆగస్టు 21: (E6tv NEWS: శివ ఠాకూర్).నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రైలు తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెల్లవారుజామున 12.35 గంటల సమయంలో సాయినగర్ షిర్డీ రైలులో RPF పోలీసులు, నిజామాబాద్ SHO ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తమ సీట్ల కింద రెండు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. సూట్‌కేసులను తనిఖీ చేయగా మొత్తం 24.3 కిలోల ఎండు గంజాయి…

Read More

లింగంపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు

పెద్దకొడప్‌గల్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు గ్రామానికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల కారణంగా వివిధ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను ప్రజలందరూ సద్వినియోగం…

Read More

మద్నూర్ మండల TSCPSEU నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మద్నూర్, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) మద్నూర్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షుడిగా వి. భీమ్‌రావు, ప్రధాన కార్యదర్శిగా కే. లక్ష్మణ్, కోశాధికారిగా పి. సురేష్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్. దశరథ్, వైస్ ప్రెసిడెంట్లుగా సంపత్‌రెడ్డి, ఎస్. రాజు, సెక్రటరీలుగా పి. శ్రీనివాస్, టీ. విజయ్, కే. రాజు…

Read More

సాయన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి: కాంగ్రెస్

ఎర్గట్ల, ఆగస్టు 21:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరొందిన పండుగ సాయన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఏరుగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్, ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదన తీసుకువచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి కాంగ్రెస్ నాయకులు,…

Read More

ఒక హత్య.. ఎన్నో ప్రశ్నలు

గురువుకు గోరీ కట్టిన గంజాయి మత్తు! స్పెషల్ స్టోరీ, ఆగస్టు 21: (E6tv NEWS: ప్రతినిధి).చదువు చెప్పి జీవితానికి బాటలు వేయాల్సిన గురువే దారుణ హత్యకు గురికావడం.. ఆ హత్యకు పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడ్డారన్న దర్యాప్తు అంశాలు వెలుగులోకి రావడం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఘటన సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడటం, చెడు…

Read More

నందిపేట ప్రయాణికుల నరకయాతన కథనం నిరాధారం: టీజీఎస్ఆర్టీసీ

నిజామాబాద్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి) నందిపేట ప్రయాణికుల ఇబ్బందులపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన “నందిపేట ప్రయాణికుల నరకయాతన” కథనం పూర్తిగా నిరాధారమని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.నిజామాబాద్–నందిపేట మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్-1 డిపో నుంచి నందిపేట మధ్య 5 పల్లెవెలుగు, 4 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు….

Read More

బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్ష

బస్వాపూర్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి).బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ పనితీరుపై గ్రామ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై సమీక్షించారు.గ్రామంలోని మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరుపై చర్చించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలను…

Read More

నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన పోచారం

నిజాంసాగర్, ఆగస్టు 20:(E6tv NEWS: ప్రతినిధి)బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, ప్రస్తుత నీటి పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు పరిస్థితి, సాగునీటి అవసరాలపై అధికారులతో చర్చించారు. ప్రస్తుత నీటి లభ్యత, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి సరఫరాపై సమీక్షించినట్లు తెలిపారు.రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు…

Read More

రాజీవ్ గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా.. సద్భావన, జాతీయ ఐక్యత కోసం ప్రతిజ్ఞ

కామారెడ్డి ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి). భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని కొనియాడారు. దేశంలో సాంకేతిక, సమాచార విప్లవానికి నాంది…

Read More