Breaking News

కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌‌ సిద్ధం: ఆర్థిక మంత్రి

ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను (BIT) మరింత సులభతరం చేసేందుకు, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. గత ఏడాదిన్నరగా సిద్ధం చేస్తున్న ఈ కొత్త టెంప్లేట్‌కు త్వరలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం లభించనుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2016 నాటి పాత విధానంలో ఉన్న లోపాలను సవరించి, దేశీయ మరియు విదేశీ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు బలమైన రక్షణ కల్పించేలా దీనిని రూపొందించామని ఆమె స్పష్టం చేశారు. నూతన విధానం ఆమోదం పొందేలోపే సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ వంటి దేశాలతో కొత్త నిబంధనల ప్రకారం ఒప్పందాలు కుదుర్చుకున్నామని, డిసెంబర్ నాటికి కెనడా, రష్యాతో పాటు మరికొన్ని దేశాలతో చర్చలు ముగించి ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *