News
ఫారం-6 మార్పు చేయాలని ECIలో ఎవరు ఆదేశించారు?: రాహుల్ ప్రశ్న
ఎన్నికల సంఘం (ECI) కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఆన్లైన్ ‘ఫామ్ 6’లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మార్పులు చట్టవిరుద్ధమని కేంద్ర ఎన్నికల కమిషనర్లే రికార్డు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ— “ఈ మార్పులు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశించారు? టీసీఎస్‌లో దీనిపై సంతకం చేసిన…
రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బాపట్ల జిల్లా రేపల్లెలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా రేపల్లెలోని 4వ వార్డులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం స్వయంగా పింఛన్లను అందజేసి వారితో ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పర్యటన ముగింపులో భాగంగా మధ్యాహ్నం రేపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో…
విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటున్న ‘సికింద్రాబాద్’ రైల్వే స్టేషన్
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.720 కోట్ల భారీ వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో పునర్నిర్మాణమవుతోంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దశలవారీగా చేపట్టిన నిర్మాణ పనులు ఇప్పటికే 69 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను వేగవంతం చేసి జూన్ 2027 నాటికి స్టేషన్‌ను పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా 6 అంతస్తుల భారీ మల్టీ-లెవల్ పార్కింగ్…
ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్‌పై కత్తితో దాడి
దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ (FZ1073) విమానంలో గాల్లో ఉండగానే అనూహ్య భయానక సంఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియా మీదుగా 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా, ఒమన్ జాతీయుడైన కో-పైలట్ సడన్‌గా ప్రధాన పైలట్ (భారతీయ జాతీయుడు స్మిత్ మచ్చార్) పై కత్తితో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో విమానం ఒక్కసారిగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం అపహరణకు గురైనట్లు సూచించే ‘7500’ ఎమర్జెన్సీ కోడ్…
ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: మంత్రులు, అధికారులతో దానం వరుస భేటీలు
అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కావడం, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు తెచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తమ పట్ల చులకనగా వ్యవహరించారని భావించిన పలువురు మంత్రులు, అధికారులు ఇప్పుడు ఆయన మారుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో తన కంటే జూనియర్లు అనే ఫీలింగ్‌తో మంత్రులను నిర్లక్ష్యం చేశారని, అధికారులతోనూ కఠినంగా వ్యవహరించేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉప ఎన్నిక ముంగిట నియోజకవర్గంలో…
15 రోజుల్లో కొత్త ఉపాధి హామీ జాబ్ కార్డులు: మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి 12 వేల మందికి పైగా సర్పంచులు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో రోజూ 100 నుంచి 150 మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. నీటి సంరక్షణలో భాగంగా “ప్రతి…
అభివృద్ధికి కేంద్ర-రాష్ట్రాల సహకారం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ కాంప్లెక్స్ (ఐడీవోసి)ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ, సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి విషయాల్లో కేంద్రంతో కలిసి పనిచేస్తామని, రాష్ట్ర సమస్యల…
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నేలకొందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ తిరిగి సీఎం అవుతారని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, ‘రికాల్, రిగ్రెట్, రివోల్ట్’ (తిరస్కరణ, పశ్చాత్తాపం, తిరుగుబాటు) అనే అంశాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. అలాగే, భాజపాతో బిఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారాన్ని…
సిరిసిల్లా ‘గడి’పై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్ అగ్రనేత కె.టి.రామారావు సొంత నియోజకవర్గం రాజన్న సిరిసిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కుటుంబ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ‘గడి’ కూలినట్లే, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లా ‘గడి’ని బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గత పదేళ్ల కాలంలో కెసిఆర్ కుటుంబం రూ. లక్ష కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టి రాష్ట్రంలోనే అత్యంత ధనవంతులుగా మారారని సీఎం ఆరోపించారు. కేటీఆర్ హైటెక్ సిటీ…
రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి
పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి: ధర్మవరం ఆర్డీఓ ఓ. రామ భూపాల్ రెడ్డి చెన్నేకొత్తపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజలకు రెవెన్యూ సేవలను నిర్ణీత గడువులోగా అందించాలని ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఓ. రామ భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండల కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆర్డీఓ.. పెండింగ్ దరఖాస్తులు, పీజీఆర్ఎస్ ఫిర్యాదులు,…
