Breaking News

పాలనలో ఉద్యోగులదే కీలక పాత్ర: సీఎం రేవంత్!

కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమగ్ర కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి, ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం, పేదల సమస్యల పరిష్కార వేదికలుగా కలెక్టరేట్ కార్యాలయాలు ఉపయోగపడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో 10.5 లక్షల మంది ఉద్యోగులే కీలక…

Read Full News

కేసీఆర్ కడితే.. రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక ‘రిబ్బన్ కటింగ్ సీఎం’ అని ఎద్దేవా చేసిన ఆయన, గతంలో కేసీఆర్ నిర్మించిన కట్టడాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, కరీంనగర్ కలెక్టరేట్ కేసీఆర్ ఆనవాళ్లు కాదా అని సూటిగా ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అభివృద్ధిలో కనీసం…

Read Full News

స్త్రీనిధి రుణ చెల్లింపుల్లో గందరగోళం.. రూ.1 లక్ష ఎక్కడికి?

రుణం చెల్లింపు పేరుతో రూ.1 లక్ష తీసుకున్నారంటూ మహిళ ఆరోపణ PhonePe లావాదేవీలు, రుణ కార్డు, చెల్లింపు రికార్డులతో విచారణకు డిమాండ్ రూ.3,615 అదనపు చెల్లింపుపైనా అనుమానాలు.. రూ.50 వేల వ్యక్తిగత రుణం తీసుకున్నారంటూ ఫిర్యాదు సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో FIR నమోదు.. సమగ్ర దర్యాప్తు కోరుతున్న బాధితురాలు సిరికొండ, సెప్టెంబర్ 30:(E6tv NEWS: శివ ఠాకూర్).మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక చేయూత అందించేందుకు అమలు చేస్తున్న స్త్రీనిధి రుణాల చెల్లింపుల వ్యవహారంలో గందరగోళం నెలకొన్నట్లు…

Read Full News

విదేశాలకు వెళ్లకుండా కుట్ర చేస్తున్నారు: కేఏ పాల్

వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కాకుండా వారేమైనా ఆదేశాలు ఇచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పాస్‌పోర్ట్ రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో విజయనగరంలో నమోదైన కేసు లేదా ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యల నెపంతో…

Read Full News

హార్టీకల్చర్ హబ్‌తో రాయలసీమ అభివృద్ధి: మంత్రి సవిత

రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్‌.. అక్టోబర్ 2న సీఎం చంద్రబాబు శ్రీకారం పులివెందులలో భారీ ట్రాక్టర్ ర్యాలీ.. స్వయంగా ట్రాక్టర్ నడిపిన మంత్రి పులివెందుల/కడప: సెప్టెంబర్ 30 (E6tv NEWS: ప్రతినిధి). రాయలసీమలో రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్‌తో ఉద్యానవన సాగులో ప్రాంతం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు.మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న మదనపల్లెలో…

Read Full News

ఒకేరోజు రెండు స్వర్ణాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ చికిత!

జపాన్‌లోని ఐచి-నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో బ్యాక్-టు-బ్యాక్ రెండు స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికితా రావు తన విజయ రహస్యాన్ని వెల్లడించింది. వరుస మ్యాచ్‌ల ఒత్తిడిని జయించడానికి ప్రశాంతమైన మనస్తత్వంతో ఆడటమే తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది. ఒత్తిడికి గురికాకుండా, హడావుడి చేయకుండా మైండ్‌సెట్‌ను నిలకడగా ఉంచుకోవడం వల్లే పతకాలు సాధించగలిగానని పేర్కొంది. ఆసియా క్రీడల కాంపౌండ్ ఉమెన్స్ టీమ్ విభాగంలో జ్యోతి వెన్నం, ప్రీతిక ప్రదీప్‌లతో కలిసి ఫైనల్‌లో చైనాపై 238-234…

Read Full News

డి-46 కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలి

ఆకుల గోపాల్‌ను తిరిగి కాలువ ఇన్‌స్పెక్టర్‌గా నియమించాలి నీటిపారుదల శాఖ అధికారికి రైతుల వినతి… ఎడపల్లి, సెప్టెంబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ప్రధాన కాలువ నుంచి డి-46 ఉపకాలువకు సాగునీరు చేరుతుంది. ఈ కాలువ ఆయకట్టు కింద ఎడపల్లి, దుబ్బతండా, బ్రాహ్మణపల్లి గ్రామాలతో పాటు బోధన్ మండలంలోని పెంటకలాన్, పెగడపల్లి, బర్దిపూర్, భూలక్ష్మి గ్రామాలకు చెందిన రైతులు సాగు చేస్తున్నారు.ప్రస్తుతం పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ సకాలంలో సాగునీరు అందకపోవడంతో…

Read Full News

‘ఫామ్-6’లో వివాదాస్పద మార్పులు వెనక్కి తీసుకున్న ఈసీ!

ఓటర్ల నమోదు కోసం ఇచ్చే ‘ఫామ్-6’ (Form 6) లో నిబంధనలకు విరుద్ధంగా చేసిన మార్పులను కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఎట్టకేలకు తొలగించింది. కేంద్ర చట్టసభలు లేదా కేంద్ర న్యాయశాఖ ఆమోదం లేకుండా ఓటర్ల దరఖాస్తు రూపంలో ‘ప్రత్యేక సాంద్రత సవరణ’ (SIR) కు సంబంధించిన వివరాలు, పూర్వీకుల ఓటర్ సమాచారాన్ని కోరే కొత్త డిక్లరేషన్‌ను ఈసీఐనెట్ (ECINET) పోర్టల్‌లో చేర్చడం వివాదాస్పదమైంది. దీనిపై ఈసీ కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు తీవ్ర…

Read Full News

తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇవ్వాలి

కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి.. ఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం కోరిన సమాచారాన్ని ఇప్పటికే సమర్పించినట్లు కేంద్ర మంత్రికి వివరించారు. మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో సీఆర్ పాటిల్‌తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై…

Read Full News

సాగునీటి విడుదలలో ఆలస్యంపై ఈటల ఆగ్రహం

తెలంగాణలో రైతులకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బుధవారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నందున, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఈటల విమర్శించారు. అలాగే తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను అమ్ముకునే…

Read Full News