Medchal
జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్సను విస్తృతం చేయాలి
ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్ చేయాలి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్). జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా హాజరై…
కాంగ్రెస్ 1000 రోజుల నయవంచన పాలనను ప్రజల్లో ఎండగడతాం
22A జాబితా పేరుతో ప్రైవేట్ భూముల యజమానులకు ఇబ్బందులు రైతు భరోసా, రైతుబీమా, ఉచిత విద్యుత్‌ను నిర్వీర్యం చేస్తున్నారు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 3:(E6tv NEWS ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్…
కాంగ్రెస్ పాలనలో రైతు దగా.. ప్రతి రైతు కుటుంబానికి రూ.6 లక్షల బాకీ: వేముల
కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవ పథకాలను పునరుద్ధరించాలి యూరియా యాప్ రద్దు చేసి నేరుగా ఎరువులు అందించాలి బాల్కొండలో భారీ రైతు సదస్సు.. వేలాది మంది రైతుల తరలింపు వేల్పూర్, సెప్టెంబర్ 3:(E6tv NEWS: ప్రతినిధి)కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతు రాజుగా బతికితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాత దగా, మోసానికి గురవుతున్నాడని…
కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. 1,000 అబద్ధాల దగాపాలన
420 హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండలో 420 అడుగుల భారీ ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ, మానవహారం, ధర్నా బాల్కొండ, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన 420 హామీలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి).ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాలేపు నర్సయ్య, వీసీ…
రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి
లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి) రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి…
రైతన్నలకు శుభవార్త.. నిజాంసాగర్ నుంచి సాగునీరు విడుదల
నిజాంసాగర్, సెప్టెంబర్ 2: (E6tv NEWS: ప్రతినిధి) రైతులకు శుభవార్త అందింది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా, సక్రమంగా…
వైఎస్సార్‌కు ఘన నివాళులు
నిజాంసాగర్ సెప్టెంబర్ 2:(E6tv NEWS ప్రతినిధి). పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల…
గణేష్ మండపాల వద్ద విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన బిచ్కుంద ప్రతినిధులు కామారెడ్డి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద మండలం నుంచి సమావేశానికి హాజరైన శెట్పల్లి విష్ణు గణేష్…
బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి
నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు? జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని…

