Medchal
కోరుట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సస్పెండ్
కోరుట్ల, అక్టోబర్ 31 (E6tv న్యూస్). విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పరిపాలనా లోపాల కారణంగా జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. సునీతారాణి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 31న జిల్లా కలెక్టర్ కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో సూపరింటెండెంట్ డాక్టర్ సునీతారాణి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి పొందకుండా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ఆసుపత్రి పరిపాలన,…
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఘనంగా నివాళులు
దేశ ఐక్యతకు పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ జగిత్యాల, అక్టోబర్ 31 (E6tv న్యూస్). భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు చిరస్మరణీయమని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో శనివారం పటేల్ విగ్రహానికి…
నూతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశం మెట్పల్లి, అక్టోబర్ 31 (E6tv న్యూస్). మెట్పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్…
విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం
నిర్మల్, అక్టోబర్ 31 (E6tv న్యూస్). నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ హైస్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ సెక్రటరీ పి. రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. అడ్వకేట్లు రాజేశ్వర్ రత్నం, ఎస్. నరేందర్, వి. మధుకర్, ఎస్ఐ సాయి సిద్ధార్థ్ పాల్గొని విద్యార్థుల హక్కులు, బాధ్యతలు, న్యాయ సేవల ప్రాముఖ్యత తదితర అంశాలను…
ఎల్‌నినో ఎఫెక్ట్.. తాగునీటి కోసం రూ.120 కోట్లు!
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లతో పాటు, ఇతర జిల్లాల తక్షణ అవసరాలకు ఒక్కో దానికి రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో అద్దె బోరుబావులు, ట్యాంకర్ల…
ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళులు
దేశ నిర్మాణంలో ఇద్దరు మహానేతల సేవలు చిరస్మరణీయం: బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్, అక్టోబర్ 31 (E6tv న్యూస్): భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. నగర డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ…
జాతీయ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్
ఘన నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఇందూరు, అక్టోబర్ 31: (E6tv NEWS: శివ ఠాకూర్). దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం విశేష కృషి చేసిన మహానుభావుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి…
భైంసాలో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన
“సురక్షిత బాల్యం ప్రతి బిడ్డ హక్కు.. పిల్లల రక్షణ మనందరి బాధ్యత” భైంసా, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురానా బజార్ ప్రాంతంలో ఉన్న సర్వేశ్వర పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), నిర్మల్ ఆధ్వర్యంలో “సురక్షిత బచపన్ అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల హక్కులు, రక్షణ, చట్టపరమైన భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బాలల ప్రాథమిక హక్కులు,…
రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని భూముల రీ సర్వే పూర్తి చేయాలి
పారదర్శకంగా భూముల హద్దుల గుర్తింపు.. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…
కొత్తపల్లిలో ఘనంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి పటాన్చెరు, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుమ్మడిదల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్తపల్లి…
