Breaking News

రూ.530 కోట్లతో మియాపూర్–ఆల్విన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణం!

రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి (E6tv న్యూస్), నవంబర్ 13: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.530 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మియాపూర్–ఆల్విన్ 6 లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి…

Read Full News

పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్ పాఠశాలల దోపిడీ!

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి – TGVP బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ బోధన్, నవంబర్ 13:(E6tv NEWS). పదో తరగతి పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని, అటువంటి పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన…

Read Full News

రహదారిపై మరో నిండు ప్రాణం బలి!

జిల్లాపల్లి ఆబాది వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సలీం మృతి పోతంగల్, నవంబర్ 13: (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పోతంగల్ మండలం జిల్లాపల్లి ఆబాది సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సలీం అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సలీంను కారు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. జిల్లాపల్లి ఆబాదికి చెందిన సలీం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…

Read Full News

స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తికి గాయాలు

రుద్రూర్ – కోటగిరి, నవంబర్ 13 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోటగిరి మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో సాయిలు అనే వ్యక్తి గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా, కోటగిరికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ ఢీకొనడంతో సాయిలుకు గాయాలయ్యాయని తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి,…

Read Full News

ఆదివాసీల ఆరాధ్య దైవం.. భగవాన్ బిర్సా ముండా!

భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమం బిర్సా ముండా వీరోచిత పోరాటం, స్వాతంత్ర్య ఉద్యమ సేవలపై విద్యార్థులకు అవగాహన పటాన్‌చెరు, నవంబర్ 12 (E6 TV న్యూస్). ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వీరుడు భగవాన్ బిర్సా ముండా అని వక్తలు పేర్కొన్నారు.పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలం బీహెచ్‌ఈఎల్‌లో ఉన్న భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో జన్‌జాతీయ గౌరవ్ పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read Full News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా పడి మహిళ మృతి!

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం మెట్‌పల్లి, నవంబర్ 11 (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బ్లూ ఫాక్స్ బార్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బండలింగాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మవ్వ (60) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆటో…

Read Full News

పేద కుటుంబం ఇంటి కూల్చివేతను అడ్డుకున్న మూడు కాలనీల నాయకులు!

గోపీనగర్, బాపునగర్, నెహ్రూనగర్ ప్రజల ఐక్యతకు నిదర్శనం కార్పొరేటర్ రాగం నాగేందర్ జోక్యంతో నిలిచిన కూల్చివేత చర్యలు శేరిలింగంపల్లి, నవంబర్ 11 (E6tv న్యూస్). పేద కుటుంబం ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకుంటున్న ఇంటి కూల్చివేతను గోపీనగర్, బాపునగర్, నెహ్రూనగర్ కాలనీల నాయకులు, ప్రజలు ఐక్యంగా అడ్డుకున్నారు. స్థానికంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో మూడు కాలనీల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి పేద కుటుంబానికి అండగా నిలిచారు. గోపీనగర్ కాలనీకి చెందిన దేవులపల్లి శివ తన…

Read Full News

ఆ గ్రామంలో పాలన ఎటు?

రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు.. డీ అంటే డీ! ఒకే గ్రామం.. రెండు వర్గాలు.. రెండు నియోజకవర్గాల రాజకీయ అండదండలు! వర్గపోరులో బలవుతున్న సామాన్య ప్రజలు.. అధికారుల పరిస్థితి ఏమిటి? E6 TV న్యూస్ – ప్రత్యేక కథనం ఆ గ్రామంలో పాలన ఎటు సాగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయా? లేక రెండు వర్గాల ఆధిపత్య పోరులో గ్రామ పాలనే గందరగోళంలో పడిందా? ప్రస్తుతం ఆ గ్రామంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒకే…

Read Full News

కోరుట్ల మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణం!

నిర్మాణం ఆపినట్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారా? మున్సిపల్ అధికారుల తీరుపై సంఘ సభ్యుల ఆగ్రహం కోరుట్ల, నవంబర్ 11 (E6tvన్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్ 3760/95, ఇంటి నంబర్ 5-1-12 పరిధిలోని స్థలంలో సంఘ సభ్యులకు తెలియకుండా సుమారు 50 గజాల స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై…

Read Full News

ఆటోపై కూలిన భారీ వృక్షం.. ఐదుగురికి గాయాలు!

డ్రైవర్, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం రుద్రూర్ (E6tv న్యూస్). రుద్రూర్–బోధన్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి ఆటోపై పడటంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడిన ఘటన కలకలం రేపింది. బోధన్ వైపు వెళ్తున్న TS 16 UA 0344 నంబర్ గల ఆటోపై ఒక్కసారిగా భారీ వృక్షం కూలడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను అంబులెన్స్‌లో…

Read Full News