Breaking News

సామాన్యుల విజయగాథలకు జాతీయ వేదికగా ‘మన్ కీ బాత్’

ఇందూరు, అక్టోబర్ 25 (E6TV న్యూస్). సామాన్యుల విజయగాథలను దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేసే జాతీయ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్‌ను ఆయన స్థానిక నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ ప్రజల కృషి, సేవా స్ఫూర్తి, ఆవిష్కరణలు, స్వదేశీ ప్రతిభను దేశవ్యాప్తంగా పరిచయం చేయడం…

Read Full News

రక్షణ రంగంలో తెలంగాణను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలి

త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0 విడుదల రక్షా ఎక్స్‌పో 2026 కర్టెన్ రైజర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 25 (E6tv న్యూస్). రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన, అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణను దేశ రక్షణ రంగ పరిశ్రమలకు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్…

Read Full News

NHM ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు

కామారెడ్డి, అక్టోబర్ 25: (E6tv న్యూస్). కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట గత 13 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఆదివారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండీ తాహెర్, జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షుడు సబ్బిడి రమేష్ సమ్మెలో…

Read Full News

లైసెన్స్ రద్దయినా ఆగని మందుల విక్రయాలు!

మెట్‌పల్లిలోని మెడికల్ స్టోర్‌పై ఆరోపణలు.. అధికారుల స్పందనపై ప్రశ్నలు మెట్‌పల్లి, అక్టోబర్ 25: (E6tv న్యూస్). జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి పట్టణంలో ఉన్న శ్రీ వేద ఎస్ఎస్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్‌పై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సదరు మెడికల్ స్టోర్ లైసెన్స్ రద్దయినప్పటికీ మందుల విక్రయాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదులు రావడం స్థానికంగా ఆందోళనకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై సంబంధిత ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు….

Read Full News

దమ్మాంలో SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు ఫౌమ్ హౌస్ కీపర్ కుమార్తె వివాహానికి రూ. 21,116 ఆర్థిక సహాయం సౌదీ అరేబియాలోని దమ్మాంలో SATA ఆధ్వర్యంలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు….

Read Full News

ఆర్మీ సైనికుడిపై దాడి కేసులో 14 మంది అరెస్ట్

14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, స్టీల్ చేతి కడియం స్వాధీనం మరింత మంది నిందితుల కోసం పోలీసుల గాలింపు మెట్‌పల్లి, అక్టోబర్ 24 (E6tv న్యూస్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, ఒక స్టీల్ చేతి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో…

Read Full News

ధర్మవరంలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా త్రివేణి ప్రచారం

చైర్మన్ అభ్యర్థి పరిశే సుధాకర్‌కు సైకిల్ గుర్తుపై ఓటేయండి 6, 11వ వార్డుల బీజేపీ అభ్యర్థులను కమలం గుర్తుపై గెలిపించండి ధర్మవరం, అక్టోబర్ 24:(E6tv NEWS). ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలిసి వారి మద్దతు కోరారు. ధర్మవరం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి టీడీపీ తరఫున పోటీ…

Read Full News

సిద్దిపేటలో దారుణం.. 15 ఏళ్ల బాలికపై అత్యాచారం!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. దసరా పండుగ రోజున 15 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ముగ్గురు మైనర్లు సహా నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. దసరా రోజు బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం…

Read Full News

పొతంగల్ సొసైటీ డైరెక్టర్ల ఎంపికపై రాజకీయ వేడి!

పాత, కొత్త కాంగ్రెస్ క్యాడర్ల మధ్య విభేదాలు? ముగ్గురు డైరెక్టర్ల నియామకంపై కొనసాగుతున్న ఉత్కంఠ పోతంగల్, అక్టోబర్ 24 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని సొసైటీ నూతన పాలకవర్గం ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. సొసైటీ చైర్మన్‌గా మాజీ జెడ్పీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హెగ్డోలి శంకర్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు ముగ్గురు డైరెక్టర్ల నియామకంపై రాజకీయ వేడి రాజుకుంటున్నట్లు స్థానికంగా చర్చలు వినిపిస్తున్నాయి.సుమారు 20…

Read Full News

ఎల్లారెడ్డిలో ఏఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనుల పరిశీలన

పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ నాయకుల కృషి.. రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యం ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులో నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయ భవన నిర్మాణ పనులను ఎల్లారెడ్డి పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. శనివారం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన నాయకులు, భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతులకు, వ్యవసాయ మార్కెట్…

Read Full News