Telangana
ఎల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ
ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో 1, 2వ వార్డుల్లో ప్రారంభమైన పనులు ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు మదన్ మోహన్ చొరవతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం…
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే కఠిన చర్యలు!
వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్లు వాడుతున్న వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కుల్సుంపుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేతిబౌలి జంక్షన్ వద్ద గోల్కొండ ట్రాఫిక్ ఏసీపీ డి. ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్లలో మాట్లాడుతూ పట్టుబడిన దాదాపు 40 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ పోలీసులు అక్కడే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలు…
రైతుల పొట్ట కొడుతున్న మిల్లర్ల సిండికేట్?
కోటగిరిలో అన్నదాతల ఆవేదన.. ఓపెన్ మార్కెట్ వ్యాపారులను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు కొనుగోలు సమయంలో రకాల పేరుతో ధరల్లో కోత.. విక్రయాల సమయంలో సన్న బియ్యానికి భారీ ధరలు రైతులకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి కోటగిరి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). కష్టపడి పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదని, స్థానిక రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఓపెన్ మార్కెట్ వ్యాపారులను కొనుగోళ్లు చేయకుండా అడ్డుకుంటున్నారని కోటగిరి…
గాంధీ భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం!
హైదరాబాద్‌లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్) వేదికగా టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రాంమోహన్ రెడ్డి మరియు పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు, లీగల్ సెల్…
శివపూర్‌లో ఘనంగా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: నాయకులు ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి మండలంలోని శివపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి మండల పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం కల్పిస్తున్న…
ఉప్పల్‌లో కొత్త బస్ టెర్మినల్.. శంకుస్థాపన చేసిన పొన్నం!
ఉప్పల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త బస్ టెర్మినల్ నిర్మాణానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం శంకుస్థాపన చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో రూ.3.22 కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్‌ను నిర్మిస్తుండగా, కేవలం 100 రోజుల్లోనే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే రోజూ దాదాపు 1,053 బస్సు ట్రిప్పుల ద్వారా లక్ష మంది ప్రయాణికులకు మెరుగైన రవాణా…
ఎల్లారెడ్డిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం ఎల్లారెడ్డి, అక్టోబర్ 24 (E6tv న్యూస్). ఎల్లారెడ్డి పట్టణంలోని ఏఎంసీ మార్కెట్ కమిటీ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎల్లారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ నాగం గంగారాం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగం గంగారాం మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి, మద్దతు ధర పొందాలని…
‘గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు’: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని రూ. లక్ష కోట్ల భారీ అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి ప్రతిమా శ్రీనివాస్ అని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడైనా ముడిసరుకు లభించే ప్రాంతంలోనే పరిశ్రమలు స్థాపిస్తారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం బొగ్గు లభించే చోట కాకుండా కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన దామరచర్లలో యాదాద్రి ప్లాంట్‌ను…
తుమ్మిడిహట్టి బ్యారేజీపై సీఎం రేవంత్ సమీక్ష
రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో జరగనున్న చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా తుమ్మిడిహట్టి, దిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలపై చర్చించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే అవకాశం…
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమం
ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహించాలి – బాలికలకు సమాన అవకాశాలు కల్పించాలి బోధన్, అక్టోబర్ 24:(E6tv NEWS). బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బేటీ జన్మోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశువుల సంరక్షణకు అవసరమైన బేబీ ప్రొడక్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ విద్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాహుల్, ఐసీడీఎస్ బోధన్…
