Telangana
నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి కార్యాచరణ
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం: ఈడీ సోలమన్ నిజామాబాద్, సెప్టెంబర్ 5: (E6tv NEWS; ప్రతినిధి) టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అభివృద్ధికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమన్ తెలిపారు. నిజామాబాద్ రీజియన్‌లో పర్యటించిన ఆయన వివిధ డిపోల పనితీరును పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్లతో సమావేశమైన ఈడీ సోలమన్.. డిపోల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన ప్రజా రవాణా…
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి
నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్…
బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో…
భీంగల్‌లో కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవం
భీంగల్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ ఆదివారం భీంగల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ, సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, డీసీసీ అధ్యక్షుడు కట్పల్లి నగేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో…
అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
నాగేంద్రనగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హత పొందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ.. పేద, అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ గుర్తింపు పత్రంగా నిలుస్తుందని తెలిపారు….
రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అరాచకాలు:భాజపా మహిళా మోర్చా
హైదరాబాద్ (E6TV): తెలంగాణలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులు, అరాచకాలపై చర్యలు తీసుకోవాలని, మహిళా భద్రతను బలోపేతం చేయాలని కోరుతూ బిజెపి మహిళా మోర్చా బృందం శుక్రవారం రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. హోం శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీరును మహిళా మోర్చా నాయకులు తీవ్రంగా…
భాజపాది ‘ఓట్ల దొంగతనం’ కుట్ర: కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ (E6TV): కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) బిజెపియేతర రాష్ట్రాల్లో “ఓట్ల దొంగతనం” కుట్రలకు పాల్పడుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ‘సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బిజెపి చూస్తోందని ఆయన…
ఉనికి కోసమే బీఆర్ఎస్ నాయకుల ఆరాటం
ప్రజా సంక్షేమంపై మరింత నిబద్ధతతో ముందుకు వెళ్తాం: మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు….
విద్యార్థులకు బూట్లు, సాక్సుల పంపిణీ
ఏర్గట్ల, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) . ఎర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు, సాక్సులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు యూనిఫామ్‌లో చక్కగా కనిపించడంతో పాటు క్రమశిక్షణతో పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బూట్లు, సాక్సులు అందజేస్తోందన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు బూట్లు, సాక్సులు ధరించి రావాలని సూచించారు. యూనిఫామ్‌ను సక్రమంగా ధరించడం, బూట్లు వేసుకోవడం,…
మంత్రి పొంగులేటికి కౌశిక్ రెడ్డి వార్నింగ్…
హన్మకొండ: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుపై నోరుపారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ చేపట్టిన ‘వంటా-వార్పు’ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి విమర్శల ప్రధానాంశాలు:

