Telangana
పోలీసుల రిమాండ్ పిటిషన్ తిరస్కరణ: క్రిశాంక్‌కు బెయిల్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేశారన్న కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి/సికింద్రాబాద్ కోర్టులో ఊరట లభించింది. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై అందిన ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీసులు ఆయనను ఉదయం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా, క్రిశాంక్‌ను రిమాండ్‌కు తరలించాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు….
63 వసంతాలు పూర్తి చేసుకున్న నెహ్రూ జూ పార్క్!
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన నెహ్రూ జూలాజికల్ పార్క్ నేటితో విజయవంతంగా 63 వసంతాలు పూర్తి చేసుకుని 64వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1963 అక్టోబర్ 6న అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.ఎమ్. శ్రీనాగేష్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ జూపార్క్, ప్రారంభంలో 280 ఎకరాల విస్తీర్ణంతో మొదలై ప్రస్తుతం 380 ఎకరాలకు విస్తరించింది. జంతువులను సహజ సిద్ధమైన వాతావరణంలో సంరక్షిస్తూ పర్యావరణ అవగాహన కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్క్‌లో 1974లో…
ఓట్ల తొలగింపుపై ప్రశ్నిస్తే అరెస్టులా?: పొన్నం ప్రభాకర్
ఓటర్ల జాబితా సవరణ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం నిరంకుశత్వమని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తూ కేంద్రం కనుసన్నల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక…
రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన-శిక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్‌కు చెందిన డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, ఇంధన పొదుపు, ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన-శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ముఖ్య అతిథిగా హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సెల్‌ఫోన్ వినియోగించకూడదని, మద్యం…
మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సమాన పనికి సమాన వేతనం అందించాలి: సాకే హరి అనంతపురం, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి)మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అందేలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో…
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రి ప్రాంగణంలో వివాదాస్పద బ్యానర్లు ఏర్పాటు చేసిన ఘటనలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, సీనియర్ నేత మన్నె క్రిషాoక్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు ఆధారంగా గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై మరింత సమాచారం తెలియాాల్సి ఉంది.
సింగరేణి కార్మికులకు పండుగ ధమాకా: రూ. 1.10 లక్షల బోనస్!
రానున్న దసరా, దీపావళి పండుగల వేళ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రదర్శన అనుసంధానిత ప్రోత్సాహకం (PLR) కింద అర్హులైన ప్రతి కార్మికుడికి రూ. 1,10,250 చొప్పున పండుగ బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ దేశానికి, తెలంగాణ అభివృద్ధికి వెలుగులు పంచుతున్న కార్మికుల కృషి వెలకట్టలేనిదని, తెలంగాణకు సింగరేణి…
ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం: 35 మంది లెక్చరర్లు డిస్మిస్!
తెలంగాణలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించిన 35 మంది ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లను ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కఠిన చర్యలు తీసుకుంది. 2023లో కాంట్రాక్టు నుంచి రెగ్యులరైజ్ అయిన ఈ లెక్చరర్ల విద్యార్హత పత్రాలపై అనుమానాలు రావడంతో, విద్యాశాఖ వాటిని సంబంధిత విశ్వవిద్యాలయాలకు వెరిఫికేషన్ కోసం పంపగా అవి నకిలీవని ధ్రువీకరణ అయింది. దీంతో వారికి షో-కాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ తీసుకున్న అనంతరం డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజన్న-సిరిసిల్ల,…
ఈనాడు పత్రికపై చట్టపరమైన చర్యలకు కేటీఆర్!
తన పాస్‌పోర్టును కోర్టు జప్తు చేసిందంటూ అవాస్తవ మరియు నిరాధారమైన కథనాన్ని ప్రచురించినందుకు గానూ ప్రముఖ తెలుగు దినపత్రిక ‘ఈనాడు’కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. సెప్టెంబర్ 29న ప్రచురితమైన ఈ కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ ఆయన తరఫు న్యాయవాది ఎన్. లలితారెడ్డి ద్వారా ఈ నోటీసు జారీ అయింది. ఏసీబీ అధికారి ప్రత్యేక కోర్టులో కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని, కోర్టు ఎలాంటి…
భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఘటన: సుధాకర్ మృతి
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన పోలాస సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) తన దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే జరిమానాలు విధిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారని, అందుకే విసిగిపోయి సుధాకర్ ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో నిజామాబాద్ జిల్లా…
