Telangana
ఎమ్మెల్యే పోచారం అండదండలతో సొసైటీని అభివృద్ధి చేస్తాం
రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు కోటగిరి, అక్టోబర్ 6: (E6tv NEWS: ప్రతినిధి) బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండదండలతో ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నూతన చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తొండ ప్రాథమిక వ్యవసాయ సహకార…
ఉస్మానియా యూనివర్సిటీకి భారీగా తరలిన MSF విద్యార్థి నాయకులు
బాన్సువాడ, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “హాలో విద్యార్థి – చలో ఉస్మానియా యూనివర్సిటీ” కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుంచి విద్యార్థి, యువ నాయకులు భారీగా తరలివెళ్లారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సోంపూర్ పోచిరాం మాదిగ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీకి బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమని,…
బ్యాంకుల్లో 5-డే వర్కింగ్ అమలు చేయాలి: కవిత మద్దతు
బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని, లేదంటే బ్యాంకులను వారమంతా తెరిచి ఉద్యోగులకు షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. పనిభారం, నిరంతర ఒత్తిడి ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ సిబ్బంది డిమాండ్ ఎంతగానో న్యాయమైనదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే సెలవులు పొందుతున్న ఉద్యోగుల కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సుదీర్ఘ పోరాటం చేస్తోందని…
సుధాకర్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలిబాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పొలాస సుధాకర్ పోలీసుల వేధింపులు తాళలేక పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని, చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సుధాకర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.సుధాకర్ మృతదేహాన్ని…
నవంబర్ నుంచి విద్యుత్ చార్జీల మోత!
తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై మరోసారి అదనపు భారం పడనుంది. డిస్కంలు రూ. 5,420 కోట్ల మేర ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసుకునేందుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) అనుమతినిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు, సరఫరా సమయంలో డిస్కంలకు అయిన వాస్తవ వ్యయానికి, టారిఫ్ ద్వారా వచ్చిన రాబడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసేందుకు ఈ ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా నియంత్రణ సంస్థ నిర్ణయించిన…
తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం చేయడమే లక్ష్యం
ముంబయి, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉన్నతస్థాయి బృందం ఆదివారం ముంబయిలో పర్యటించింది. ముంబయిలోని ఆంధ్ర మహాసభలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పలువురు ఉద్యమకారులను కమిటీ సభ్యులు గుర్తించి సత్కరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్ అడ్లంకి దయాకర్, ప్రొఫెసర్…
మాదిగలకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
రైతులకు నిరంతర విద్యుత్, వరికి మద్దతు ధర కల్పించాలి జుక్కల్, అక్టోబర్ 5: (E6tv NEWS: ప్రతినిధి). మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యంలో తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో ఆయన మాట్లాడుతూ మాదిగలకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు,…
కలెక్టర్ ఆదేశాలను పాటించని బోధన్ ఎంఈఓ?
విద్యార్థికి టీసీ, బోనఫైడ్ ఇప్పించాలని సబ్ కలెక్టర్‌కు వినతి బోధన్:, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతిలో చేరేందుకు ప్రయత్నిస్తున్న మైనార్టీ విద్యార్థికి టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్లు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ఇక్రా మోడల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎత్తోండ రాజేందర్ కోరారు.ఈ మేరకు సోమవారం బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థి శేక్ తాజ్రీమ్ ఆర్థిక…
23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్ల పంపిణీ
రుద్రూర్, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రుద్రూర్ సెక్టార్ పరిధిలోని 23 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆట వస్తువులు, మ్యాట్లను పంపిణీ చేశారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆటల ద్వారా శారీరక, మానసిక వికాసం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత, చంద్రశేఖర్…
ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర సర్వే చేయాలి
నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి వర్ని, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి). ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా సమగ్రంగా సర్వే నిర్వహించి, పార్టీలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్ని మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ వర్ని మండల అధ్యక్షులు ఆవుల రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజమైన అర్హులకు…
