Adilabad
భీంగల్‌లో జల శక్తి అభియాన్–జన భాగీదారి కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నీటి సంరక్షణపై అవగాహన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు పిలుపు సీజనల్ వ్యాధుల నివారణపై మున్సిపల్ కమిషనర్ సూచనలు భీంగల్, జూలై 28: E6 tv NEWS,(T, గంగాధర్)కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సీడీఎంఏ (CDMA) ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో “జల శక్తి అభియాన్–జన భాగీదారి (JSJB–3.0)” కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. భీంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ…
తెలంగాణలో 1 లక్ష దాటిన షోరూమ్ వెహికల్ రిజిస్ట్రేషన్లు.. ఆర్‌టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే!
హైదరాబాద్: వాహన కొనుగోలుదారులకు రవాణా శాఖ అందించిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ (Dealer Point Registration) విధానం కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జనవరి చివరి వారంలో ప్రారంభించిన ఈ సేవల ద్వారా షోరూమ్‌లలోనే పూర్తయిన నాన్-కమర్షియల్ (సొంత) వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య 1 లక్ష దాటింది. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఆర్‌టీఏ (RTA) కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరిగే అవసరం లేకుండా, షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్‌సి…
₹5,500 కోట్లతో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్.. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో మైలురాయి: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్!
హైదరాబాద్: ఆదిలాబాద్ విమానాశ్రయం (Adilabad Airport) ఏర్పాటుకు ఆమోదం లభించడం కేవలం ఒక జిల్లాకే పరిమితమైన అంశం కాదని, ఉత్తర తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇది ఒక రమ్యమైన అవకాశమని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) మరియు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సంయుక్తంగా అభివృద్ధి చేయనున్న ఈ ‘జాయింట్ యూజర్…
గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్.. ఐటీడీఏ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్ సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహ!
హైదరాబాద్: తెలంగాణలోని గిరిజన, అటవీ గ్రామాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక హెల్త్‌కేర్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా పట్టణ ప్రాంతాలతో సమానంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి…
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత
భీంగల్, జూలై 27: E6 tv NEWS, (T, గంగాధర్.) భీంగల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన చిలివేరి నాగేష్ (తండ్రి: నాగయ్య) తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్‌ను సంప్రదించారు.విషయాన్ని పరిశీలించిన ముత్యాల సునీల్ కుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితుడికి రూ.3,00,000 విలువైన…
గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
ఏడాదిలో 7 టన్నుల గంజాయి స్వాధీనం – అంతర్‌రాష్ట్ర ముఠాలపై ఉమ్మడి ఆపరేషన్లు NCB, DRI, పొరుగు రాష్ట్రాల పోలీసులతో సంయుక్త దాడులు ఆల్ప్రాజోలమ్, గంజాయి కేసుల్లో భారీ స్వాధీనం – RNCC కఠిన చర్యలు 165 మంది వినియోగదారులకు డీ-అడిక్షన్ చికిత్స – 492 అవగాహన కార్యక్రమాలు యాంటీ డ్రగ్ సోల్జర్”గా ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: పోలీసులు నిజామాబాద్ జూలై 27:E6 tv NEWS శివ ఠాకూర్. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా,…
భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
భీంగల్, జూలై 27: (E6 tv NEWS, T, గంగాధర్) భీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సయ్య అంత్యక్రియల నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు, కుటుంబానికి అండగా ఉంటామని…
తెలంగాణలో పుష్కలంగా ఎరువుల నిల్వలు.. అక్రమార్కులపై కఠిన చర్యలు: కేంద్రమంత్రి జేపీ నడ్డా!
హైదరాబాద్ / న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో (2026) తెలంగాణకు అవసరమైన ఎరువుల సరఫరా తగినంతగా అందుబాటులో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పార్లమెంట్‌లో వెల్లడించారు. లోక్‌సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు. ఎరువుల నల్లబజారు (బ్లాక్ మార్కెటింగ్), దారి మళ్లింపును అరికట్టేందుకు ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ (EC Act, 1955) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్…
తెలంగాణలో మంగళవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు (సోమవారం, మంగళవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అత్యధికంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో 76.8 మిమీ వర్షపాతం నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో 51 మిమీ, కందిలో 42.5 మిమీ, కడ్పాల్‌లో 41.3 మిమీ వర్షపాతం రికార్డైంది. రాబోయే…
సర్కారీ బడుల చేరికల్లో ‘మంచిర్యాల’ భేష్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం!
మంచిర్యాల: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను (ఎన్‌రోల్‌మెంట్) పెంచే లక్ష్యంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించి రికార్డు సృష్టించింది. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం అదనపు చేరికలు సాధించాలని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో మంచిర్యాల ఏకంగా 95.72 శాతం ప్రగతిని సాధించింది. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య జులై 25న విడుదల చేసిన ‘యు-డైస్’ (U-DISE) పోర్టల్ నివేదిక ద్వారా ఈ…

