Breaking News

ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం

ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి…

Read More

అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు

పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్‌లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్‌లకు…

Read More

జీఓ 97 రద్దు చేయాలి

రాహుల్ గాంధీకి AISF పోస్ట్‌కార్డుల ద్వారా విద్యార్థుల వినతి కొత్తగూడెం,సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జీఓ నంబర్‌ 97ను రద్దు చేయాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం రాహుల్ గాంధీకి పోస్ట్‌కార్డుల ద్వారా వినతి తెలిపారు.ఈ సందర్భంగా AISF జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల విజయ్ మాట్లాడుతూ.. SBTET బోర్డును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్య కార్పొరేటీకరణకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన…

Read More

ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి

ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహణతో ప్రజలకు చేరువగా పాలన పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి…

Read More

అసెంబ్లీనా.. కౌరవసభనా?

ప్రజాస్వామ్య సభలో పోలీసు రాజ్యం అంటూ బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం మఠంపల్లి, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాల్సిన అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులపై పోలీసుల దాడులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.మండల బీఆర్‌ఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…

Read More

తాళ్ల రాంపూర్, దోమచందాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతిని) ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను తాళ్ల రాంపూర్, దోమచందా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో తహసీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇన్‌చార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్, దోమచందా గ్రామంలో సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్…

Read More

పాల్వంచ మండల సమస్యలు పరిష్కరించాలి

36 గ్రామ పంచాయతీల సమస్యలపై ఎంపీడీవోకు బీఆర్‌ఎస్ వినతి పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం పాల్వంచ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సూచనలతో పాల్వంచ మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు విశ్వనాథం, మల్లెల శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

Read More

HCA అండర్-16 జట్టుకు పాల్వంచకు చెందిన ముగ్గురు ఎంపిక

సృజంత్, దివాకర్, ప్రిన్స్‌కు చోటు పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచకు చెందిన నెక్స్ట్‌జెన్ క్రికెట్ అకాడమీకి చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అండర్-16 జట్టుకు ఎంపికయ్యారు. అకాడమీ ఆటగాళ్లు సృజంత్, దివాకర్, ప్రిన్స్ ప్రతిభ కనబరిచి జట్టులో స్థానం సంపాదించారు.HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో తమ ప్రతిభను చాటుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు అండర్-16 జట్టుకు ఎంపిక కావడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారి…

Read More

పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్

జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్‌-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా,…

Read More

పలువురి దశదినకర్మల్లో పాల్గొని సంతాపం తెలిపిన కొత్వాల

కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించిన కొత్వాల దంపతులు. పాల్వంచ, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి). పాల్వంచ పట్టణ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ మాజీ డైరెక్టర్‌, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు, పాతపాల్వంచ 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ కొత్వాల విమలాదేవి ఆదివారం పరామర్శించారు. ఆయా కుటుంబాల్లో నిర్వహించిన దశదినకర్మలు, చిన్నకర్మ కార్యక్రమాల్లో పాల్గొని మృతులకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పాల్వంచకు చెందిన…

Read More