Mahaboobnagar
మానవతా దృక్పథం చాటిన ఎస్పీ నరసింహ
MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం సూర్యాపేట, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందు NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందడంతో ఆమెకు తన వంతు సహాయంగా రూ.20…
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
అక్రమ ఇసుక, పశు రవాణాపై కఠిన చర్యలు: ఎస్పీ రోహిత్ రాజు కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో సత్వర పరిష్కారం చూపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సమస్యలతో వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించి,…
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు
ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్న విద్యార్థులు భద్రాచలం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితిని పురస్కరించుకుని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఎకో క్లబ్, ఎన్‌ఎస్‌ఎస్, కల్చరల్ విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి ప్రతిమలను రూపొందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ.. మట్టి వినాయక ప్రతిమలను వినియోగించడం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు….
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం
ఆసుపత్రుల సమయపాలన, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి: డీఎంహెచ్‌ఓ పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచించారు. శుక్రవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల…
భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం మండలం చిట్టిరామవరం తండాలో జరుగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల వినియోగం, భూముల కొలతలు, వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల…
శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రకృతి సిద్ధమైన విగ్రహాలతో అలరించిన విద్యార్థులు పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకులు, బంకమట్టి, క్లే, ధాన్యాలు, పప్పుధాన్యాలు, గోధుమ పిండితో స్వయంగా తయారు చేసిన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మిర్చాల మాట్లాడుతూ వినాయక చవితి జ్ఞానం, శ్రేయస్సు, అభ్యుదయానికి ప్రతీక అన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తగా వినాయకుడిని…
వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
డీజేలకు అనుమతి లేదు.. మండపాల వద్ద గొడవలకు నిర్వాహకులదే బాధ్యత: ఎస్‌ఐ నరేష్ హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) వినాయక చవితి ఉత్సవాల నిర్వాహకులు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుని భక్తి భావంతో పండుగను నిర్వహించుకోవాలని హుజూర్‌నగర్ ఎస్‌ఐ చలికంటి నరేష్ సూచించారు. మండపాలను రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ వినియోగానికి సంబంధిత అధికారుల అనుమతి పొందాలని తెలిపారు. మండపాల వద్ద అశ్లీల పాటలు, నృత్యాలు నిర్వహించరాదని, డీజే సౌండ్ సిస్టమ్‌కు ఎలాంటి…
పేదలకు రూ.230కే సిమెంట్
తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్‌ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను కూడా తక్కువ ధరకే…
హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం
నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….
గుండెపోటుతో జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీ మృతి
జుక్కల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) జుక్కల్ మండలం కౌలాస్ గ్రామానికి చెందిన విఠల్‌రావు పాటిల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించే సహాయ ప్రభుత్వ న్యాయవాది (ఏజీపీ)గా విధులు నిర్వహిస్తున్నారు.తోటి న్యాయవాదులతో కలిసి రాజస్థాన్‌లోని సోమ్‌నాథ్ యాత్రకు వెళ్లిన విఠల్‌రావు పాటిల్ తిరుగు ప్రయాణంలో గురువారం జైపూర్ సమీపంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందారు….

