Breaking News

రామచంద్రాపురంలో ఘనంగా సదరు సమ్మేళన సమావేశం

రామచంద్రాపురం, అక్టోబర్ 25 (E6 TV న్యూస్).

రామచంద్రాపురంలోని మందుమూల శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి ఆవరణలో రాగం రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదరు సమ్మేళన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో స్థానిక కుల పెద్దలు, సంఘం ప్రముఖులు పాల్గొని పండుగ నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం దీపావళి పండుగను ఈ నెల 8వ తేదీన జరుపుకున్న తరువాత, ఈ నెల 10వ తేదీ మంగళవారం సదరు పండుగను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పుష్పా నగేష్ యాదవ్, తొంట అంజయ్య, పరమేష్, ఐలేష్, బిక్షపతి, ఎలవర్తి మల్లేష్, కురుమ సంఘం అధ్యక్షుడు తొంట నరసింహ, నవీన్, వనం కుమార్, రాగిణి, శ్రావణ్, రాగం గణేష్, చందర్, రామచందర్, పెద్దగల లక్ష్మీనారాయణ, హెచ్‌డీ పశు పోషకుల సుధాకర్, యు. రాము, కె. ఐలేష్, ఏ. భాను, ఆర్. విక్కి, బొంబాయి కాలనీ శ్రీనివాస్ యాదవ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *