Breaking News

రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రాకుండా పారిపోతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. ‘ఓటు చోరీ’ అనే పదాన్ని సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం లాంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుంటోందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా ఓటు చోరీ జరగలేదని, రాహుల్ గాంధీ దగ్గర ఆధారాలు ఉంటే పార్లమెంట్‌లో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర హోం మంత్రి…

Read Full News

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణపై కేంద్రంపై కేటీఆర్ ఫైర్!

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రతిపాదనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు జాతి సంపద అని, వాటి ఆస్తుల విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపడం వెనుక అంతరార్థమేమిటని ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. రిజర్వ్ ధర కంటే తక్కువకు బిడ్లు వచ్చినప్పుడు మదింపు నిబంధనలను ఎందుకు మార్చారని, బ్యాంక్ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లో ఐడీబీఐకి…

Read Full News

వట్టినాగులపల్లిలో జూదంపై ఉక్కుపాదం.. 27 మంది అరెస్ట్!

హైదరాబాద్‌ శివారులోని వట్టినాగులపల్లిలో నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జూద శిబిరంపై దాడి చేసి 27 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అక్కడి నుంచి రూ. 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు నెలలుగా ముగ్గురు వ్యక్తులు నిర్వాహకులుగా వ్యవహరిస్తూ ఇక్కడ ప్రతిరోజూ సుమారు రూ. 20 లక్షల మేర లావాదేవీలు సాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు….

Read Full News

జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఫైర్.. కూల్చివేతలపై నిలదీత!

భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించిన తర్వాత మళ్లీ కూల్చివేతలకు దిగడంపై తెలంగాణ హైకోర్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజ్‌గిరి డిఫెన్స్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ‘హైడ్రా’ చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ విచారణ చేపట్టారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ లేఅవుట్లలోని ప్రజా వినియోగ స్థలాల పేరుతో రెవెన్యూ, హైడ్రాలకు లేఖలు రాయడంపై జీహెచ్‌ఎంసీ వైఖరిని కోర్టు…

Read Full News

హైదరాబాద్‌లో భారీ వర్షం: నాలాలో పడిన డెలివరీ బాయ్ రక్షణ

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమై నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. విటల్‌రావు నగర్ సమీపంలో రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, రోడ్డు సరిగా కనిపించక 46 ఏళ్ల జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అర్జున్ ద్విచక్ర వాహనంతో సహా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నాలాలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సమయానుకూలంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అర్జున్‌ను…

Read Full News

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.. ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ఫ్లాష్ వాక్ నిజామాబాద్, అక్టోబర్ 30 (E6tv న్యూస్: శివ ఠాకూర్). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ శుభం ప్రకాశ్ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోన్ ఫ్లాష్‌లైట్లతో ప్రత్యేక ఫ్లాష్ వాక్, అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,…

Read Full News

భైంసాలో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టాలపై అవగాహన

“సురక్షిత బాల్యం ప్రతి బిడ్డ హక్కు.. పిల్లల రక్షణ మనందరి బాధ్యత” భైంసా, అక్టోబర్ 30:(E6tv NEWS: ప్రతినిధి). నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురానా బజార్ ప్రాంతంలో ఉన్న సర్వేశ్వర పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), నిర్మల్ ఆధ్వర్యంలో “సురక్షిత బచపన్ అభియాన్” కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లల హక్కులు, రక్షణ, చట్టపరమైన భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బాలల ప్రాథమిక హక్కులు,…

Read Full News

నేతాజీ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం

జలమండలి అధికారుల దృష్టికి సమస్య.. చొరవ చూపిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ గచ్చిబౌలి, అక్టోబర్ 30:(E6tv NEWS). శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించింది. డ్రైనేజీ నుంచి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ వెంటనే జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సూపర్వైజర్ సురేష్‌కు సమాచారం అందించడంతో…

Read Full News

రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని భూముల రీ సర్వే పూర్తి చేయాలి

పారదర్శకంగా భూముల హద్దుల గుర్తింపు.. రైతుల సమక్షంలోనే సర్వే చేపట్టాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నిర్మల్ జిల్లా, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). భూముల రీ సర్వే ప్రక్రియను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం నర్సాపూర్ (జి) మండలం చాక్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…

Read Full News

కొత్తపల్లిలో ఘనంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి పటాన్‌చెరు, అక్టోబర్ 30 (E6 TV న్యూస్). సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి బీఆర్ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుమ్మడిదల మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్తపల్లి…

Read Full News