Breaking News

CJI వ్యాఖ్యల వివాదం: బిసిఐ ఆదేశాలపై లీగల్ సమీక్ష జరపనున్న నాల్సార్ (NALSAR)

హైదరాబాద్‌లోని ప్రముఖ నాల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం (NALSAR University of Law) సమావర్తన ఉత్సవానికి (Convocation) భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావడంపై కొంతమంది విద్యార్థులు చేపట్టిన వ్యతిరేక ప్రచారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) జారీ చేసిన ఆదేశాలను తమ అత్యున్నత నిర్ణయాత్మక మండలి ‘ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ ముందు ఉంచనున్నట్లు నాల్సార్ గురువారం…

Read More

పెన్షన్ల కోసం ప్రత్యేక క్యాంపు

నిర్మల్ ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లోని ఈడెన్ గార్డెన్‌లో స్థానిక కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ క్యాంపు ద్వారా అవగాహన కల్పించారు.అర్హులైన ప్రజలు తమ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డులతో క్యాంపునకు వచ్చి అవసరమైన వివరాలు సమర్పించాలని కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కోరారు. తెలంగాణ…

Read More

ఆగస్టు 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు పర్యటన: మేడారంలో దర్శనం, పెన్షన్ల పంపిణీ ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ నెల 16న (ఆగస్టు 16) ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం మరియు మంత్రులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), కలెక్టర్ బోర్కడే సహదేవరావు మరియు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్‌లతో కలిసి గట్టమ్మ సమీపంలో అభివృద్ధి పనులను, పైలాన్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలోని ప్రధాన అంశాలు:

Read More

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు మరియు భూమి సర్వే నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన జగిత్యాల జిల్లా బీర్పూర్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) మంచికట్ల రాహుల్ గురువారం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సంఘటన వివరాలు: లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ పోలీసులు, ఆర్‌ఐ రాహుల్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.

Read More

తెలంగాణలోని 3 రక్షిత స్మారక కట్టడాల ఆక్రమణ: కేంద్రం ప్రకటన

దేశవ్యాప్తంగా ఆక్రమణలకు గురైన 414 కేంద్ర రక్షిత స్మారక కట్టడాలు (Centrally Protected Monuments) మరియు చారిత్రక ప్రదేశాల జాబితాలో తెలంగాణలోని మూడు కట్టడాలు ఉన్నాయని కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో గురువారం వెల్లడించారు. అయితే, ఆ మూడు కట్టడాల పేర్లను కేంద్ర ప్రభుత్వం తన లిఖితపూర్వక సమాధానంలో అధికారికంగా ప్రకటించలేదు. దేశమంతటా కేంద్ర ప్రాముఖ్యత కలిగిన 3,688 పురావస్తు ప్రదేశాలు ఉండగా, స్థానిక రెవెన్యూ రికార్డుల్లో భూ యాజమాన్య…

Read More

రాయిదుర్గం భూముల వేలం రద్దు చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు డిమాండ్

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న 10.63 ఎకరాల భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఆయన గురువారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా ఈ నెల 17, 21 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ఈ భూముల వేలం వెనుక తీవ్ర…

Read More

కేబీఆర్ పార్క్ వద్ద ఆగస్టు 18 నుండి కొత్త ‘వన్-వే’ ట్రాఫిక్ నిబంధనలు: వాకర్లకు సీపీ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని ప్రముఖ కె.బి.ఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాల్లో ఈ నెల 18 (ఆగస్టు 18) నుంచి అమలు చేయనున్న సరికొత్త వన్-వే (One-Way) ట్రాఫిక్ నిబంధనలపై నగర ట్రాఫిక్ పోలీసులు ఉదయం వాకింగ్ వచ్చే ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్, డీసీపీ ట్రాఫిక్-II కాజల్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకర్లతో మాట్లాడి, రాబోయే ట్రాఫిక్ మార్పుల గురించి…

Read More

వనమహోత్సవంలో భాగంగా ఇంటింటికీ మొక్కల పంపిణీ

భీంగల్, ఆగస్టు 14: (E6 tv NEWS ప్రతినిధి). ప్రభుత్వ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ నుంచి 6వ వార్డుల్లో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మహిళలకు మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి, మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ హాజరయ్యారు. 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు, 2వ వార్డు…

Read More

హల్ద్వానీ ఘటనకు నిరసనగా కామారెడ్డిలో పాదయాత్ర–సత్యాగ్రహం

కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి) హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల…

Read More

గోవింద్‌పేట్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరు మహిళలు మృతిమరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్, ఆగస్టు 13: (E6 tv NEWS, శివ ఠాకూర్). ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి…

Read More