Breaking News

బడా భీంగల్‌లో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌కు భూమిపూజ

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్‌తో రూ.3 లక్షల నిధులు

బడా భీంగల్, సెప్టెంబర్ 29:(E6tv NEWS: ప్రతనిధి)

బడా భీంగల్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత వారిని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధిని, ఉపసర్పంచ్ శంకర్ గౌడ్, వీఐడీసీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, వీఓ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *