Breaking News

మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ

మద్నూర్, సెప్టెంబర్ 28:(E6tv NEWS: ప్రతినిధి) మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. NRLM రాష్ట్ర రిసోర్స్ పర్సన్లు ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణ అందించారు. రానున్న ఐదేళ్లలో సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయికి చేరుకోవాలనే అంశంపై ముందుచూపుతో విజన్‌ (కల)ను ఎలా రూపొందించుకోవాలో శిక్షణలో వివరించారు. ఆ విజన్‌ను సాకారం చేసుకునేందుకు అవసరమైన వ్యూహాలను ఎలా…

Read Full News

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి

మద్నూర్, సెప్టెంబర్ 28: (E6tv NEWS: ప్రతినిధి) కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామంలోని మార్కండేయ మందిరంలో ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి కులబాంధవుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సామాజిక సేవలు, ప్రజా ఉద్యమాల్లో పోషించిన పాత్రను స్మరించుకున్నారు. బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పలువురు…

Read Full News

డీఎస్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు

నిజామాబాద్, సెప్టెంబర్ 27,:(E6tv NEWS: ప్రతినిధి). మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు, స్వర్గీయ డి. శ్రీనివాస్ (డీఎస్) జయంతి సందర్భంగా కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి. శ్రీనివాస్‌ గారి సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాజకీయాల్లో డి. శ్రీనివాస్‌ తనదైన ముద్ర వేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలతో…

Read Full News

గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేసిన VDC సభ్యులపై చర్యలు తీసుకోవాలి

తాళ్లరాంపూర్‌లో VDC దౌర్జన్యాలు మితిమీరాయి 39 మంది గౌడలు, 10 మంది దళితులను సాంఘిక బహిష్కరణ చేశారంటూ ఆరోపణ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి). ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ (VDC) పేరుతో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని గౌడ కులస్తులు ఆరోపించారు. తమ కులానికి చెందిన వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేసినట్లు పేర్కొంటూ, ఇందుకు బాధ్యులైన VDC సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం…

Read Full News

బాపూజీ సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే

తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు బీఆర్ఎస్ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం: వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి) తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాపూజీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి…

Read Full News

రూ.63 వేల లంచం తీసుకుంటూ సీడీపీవో అరెస్ట్

అంగన్‌వాడీ టీచర్ల నుంచి లంచం డిమాండ్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ మెట్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి) అంగన్‌వాడీ టీచర్ల నుంచి రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్‌పల్లి ఐసీడీఎస్‌ సీడీపీవో పద్మ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని సీడీపీవో కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల మెట్‌పల్లి మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలను సీడీపీవో పద్మ తనిఖీ చేశారు. తనిఖీలకు సంబంధించిన రిపోర్టును అనుకూలంగా నమోదు చేసేందుకు అంగన్‌వాడీ టీచర్ల నుంచి…

Read Full News

ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 26: (E6tv NEWS: ప్రతినిధి). రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఇరవైత్రి అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనిల్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పాలేపు నర్సన్న, వీసీ బుచ్చన్న, మాజీ అధ్యక్షులు సుంకేట రవి, జిల్లా మైనారిటీ నాయకులు రఫీ, జిల్లా కిసాన్ ఖేత్…

Read Full News

మోపాల్‌లో దుర్గామాత ఉత్సవ సమితి నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

మోపాల్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మోపాల్ గ్రామంలో శనివారం దుర్గామాత ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు, గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో నూతన షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భూమిపూజ చేశారు. దుర్గామాత ఉత్సవాలను ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఉత్సవాల సందర్భంగా గ్రామ ప్రజలు,…

Read Full News

మిర్జాపూర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి

నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 26:(E6tv NEWS: శివ ఠాకూర్). మిర్జాపూర్ గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని 3వ వార్డు మెంబర్ సబ్బిడి మొగులవ్వ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబ్బిడి రమేష్ మాట్లాడుతూ.. దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. పేదలు, మహిళల హక్కుల…

Read Full News

గణేష్ నిమజ్జనంపై పోలీసుల పటిష్ట నిఘా

కమాండ్ కంట్రోల్ హాల్‌ నుంచి పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య 200 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ట్రాఫిక్, భద్రతపై ప్రత్యేక దృష్టి నిజామాబాద్, సెప్టెంబర్ 25:(E6tv NEWS: శివ ఠాకూర్). గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా నిజామాబాద్ నగరంలో పోలీస్ శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ హాల్‌ నుంచి నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ క్షుణ్ణంగా…

Read Full News